ఉద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్

25 May, 2017 15:20 IST|Sakshi
ఉద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్
అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాగ్నిజెంట్ లో భారీ ఉద్యోగాల కోత ఉండబోతుందంటూ, బలవంతంగా ఉద్యోగులపై వేటు వేస్తుందంటూ వస్తున్న రూమర్లను కంపెనీ యాజమాన్యం కొట్టిపారేసింది.  ఈ విషయంపై నేడు కంపెనీ అధ్యక్షుడు రాజీవ్ మెహతా ఉద్యోగులకు లేఖ రాశారు.  ఈ లేఖలో కాగ్నిజెంట్ ఎలాంటి లేఆఫ్స్  ప్రక్రియను కంపెనీ చేపట్ట లేదంటూ పేర్కొన్నారు. ''పరిశ్రమ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ప్రతేడాది పర్ ఫార్మెన్స్ సమీక్ష చేపడతాం, గతేడాది పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడం కోసమే ఈ ఏడాది కూడా రివ్యూలు చేపట్టాం.  ఇది తర్వాతి సంవత్సరం లక్ష్యాలను నిర్దేశిస్తోంది'' అని రాజీవ్ మెహతా తెలిపారు.
 
అయితే ఐటీ పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం భారత్ లో ఈ కంపెనీ 6వేల మంది ఉద్యోగులను తొలగించనుందని తెలిసింది. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులకు కంపెనీ వాలంటరీ రిటైర్మెంట్ ప్రొగ్రామ్ కూడా ప్రకటించిందని రిపోర్టులు తెలిపాయి.అదేవిధంగా బలవంతంగా ఉద్యోగులను కాగ్నిజెంట్ ఇంటికి పంపించి వేస్తుందటూ కొంతమంది ఉద్యోగులు కూడా  ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల మేరకు ఐటీ గ్రూప్ లు వివిధ రాష్ట్రాల్లో లేబర్ డిపార్ట్ మెంట్ ముందు తమ గోడును వెల్లబుచ్చుకున్నాయి. 
 
కానీ మార్కెట్లో వస్తున్న ఈ ఊహాగానాలన్నింటిన్నీ  కాగ్నిజెంట్ మేనేజ్ మెంట్ కొట్టిపారేస్తుంది.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక మార్కెట్లలో తాము నియామకాలు చేపడతామని పేర్కొంటోంది. చాలా ఏళ్ల నుంచి అమెరికాలో రిక్రూట్ మెంట్లు పెంచుతున్నట్టు కూడా తెలిపింది.  తాము నియామకాలు చేపట్టబోయే దేశాల్లో భారత్ కూడా ఉందని లేఖలో రాజీవ్ మెహతా చెప్పారు. డేటా సైన్సు, బిగ్ డేటా, మిషన్ లెర్నింగ్, అడోబ్ స్టాక్ వంటి వాటిలో  రీస్కిలింగ్ ప్రొగ్రామ్స్ ను ఉద్యోగులు చేపట్టాలని మెహతా సూచించారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ కు ప్రపంచవ్యాప్తంగా 2,62,000 మంది ఉద్యోగులుండగా.. వారిలో 1,50,000పైగా మంది భారత్ లోనే ఉన్నారు.
 
మరిన్ని వార్తలు