ఆర్థిక వ్యవస్థపై నిర్మలా సీతారామన్‌ కీలక సమీక్ష

8 Nov, 2019 05:30 IST|Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌ సహా ప్రముఖుల హాజరు

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్‌’ (ఎఫ్‌ఎస్‌డీసీ) 21వ సమావేశంలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమీక్ష చేశారు. గురువారం ఢిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్‌ తదితర కీలక ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎఫ్‌ఎస్‌డీసీ అనేది ఆర్థిక రంగానికి సంబంధించి నియంత్రణ సంస్థల అత్యున్నత మండలి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు.

దేశ జీడీపీ వృద్ధి జూన్‌ త్రైమాసికంలో 5%కి క్షీణించడం, సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు ఆశావహంగా లేకపోవడంతో ఈ సమీక్షకు ప్రాధాన్యం నెలకొంది. ‘‘స్థూల ఆర్థిక అంశాలతోపాటు ఆర్థిక రంగ పరిస్థితులపై వివరంగా చర్చించడం జరిగింది. నియంత్రణ పరంగా అంతర్గత అంశాలతోపాటు, సైబర్‌ భదత్రపైనా సమీక్ష జరిగింది’’అని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ సమావేశం అనంతరం మీడియా ప్రతినిధులకు తెలిపారు. ‘‘అధిక శాతం ఎన్‌బీఎఫ్‌సీలు చక్కగా పనిచేస్తున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలను సమీకరించుకోగలుగుతున్నాయి. కొన్ని అయితే విదేశాల నుంచి నిధులు తెచ్చుకుంటున్నాయి’’ అని దాస్‌ తెలిపారు. సెబీ చైర్మన్‌ అజయ్‌త్యాగి, ఐఆర్‌డీఏఐ చైర్మన్‌ సుభాష్‌చంద్ర కుంతియా తదితరులు  పాల్గొన్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్యాష్‌ ఈజ్‌ కింగ్‌!

దారి తప్పిన ‘సెల్ఫ్‌ డ్రైవింగ్‌ టెస్లా’ కారు!

హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు శుభవార్త

అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ ముగియనుందా !

క్యూ2 లో సన్‌ ఫార్మాకు భారీ లాభాలు 

శాంసంగ్‌ టీవీల్లో ‘నెట్‌ఫ్లిక్స్‌’ కట్‌

హీరో మోటో తొలి బీఎస్-6  బైక్‌ 

మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్‌ ఎలైట్‌, ధర ఎంతంటే

సెన్సెక్స్‌ జోరు,12 వేల ఎగువకు నిఫ్టీ

రియల్టీ బూస్ట్‌ : సూచీల జోరు

ఫ్లిప్‌కార్ట్‌లో నోకియా స్మార్ట్‌ టీవీలు..!

మారుతీ, టయోటా సుషో జాయింట్‌ వెంచర్‌

వాట్సాప్‌లో గోప్యతకు మరో ఫీచర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌లో వీఆర్‌ఎస్‌ ‘రింగ్‌’

టాటా స్టీల్‌ లాభం 3,302 కోట్లు

వచ్చే 20 ఏళ్లలో 2,400 కొత్త విమానాలు అవసరం

జోయ్‌ అలుక్కాస్‌లో బంగారం కొంటే వెండి ఫ్రీ

భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా

దేవుడే చెప్పినా మా లెక్క తప్పదు!

మోదీ ‘రియల్‌’ బూస్ట్‌!

రియల్టీ రంగానికి భారీ ఊరట

నోకియా సూపర్‌ స్మార్ట్‌ టీవీలు : ఫ్లిప్‌కార్ట్‌తో జత

సెన్సెక్స్‌ రికార్డు ముగింపు

బుల్‌ రన్‌,  ఆల్‌ టైం గరిష్టానికి సెన్సెక్స్‌

రికార్డు హైకి చేరిన సెన్సెక్స్‌

ఆ ఆరోపణలను తోసిపుచ్చిన ఇన్ఫోసిస్‌

ఆన్‌లైన్‌ షాపింగ్‌ జబ్బే..!

జేఎస్‌పీఎల్‌ నష్టాలు రూ.399 కోట్లు

టైటాన్‌... లాభం రూ.312 కోట్లు

డాబర్‌ ఆదాయం రూ.2,212 కోట్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షూట్‌ షురూ

తీన్‌మార్‌?

మహేశ్‌ మేనల్లుడు హీరో

అరుణాచలం దర్బార్‌

యాక్టర్‌ అయినంత మాత్రాన విమర్శిస్తారా?

రాజీపడని రాజా