ఐదుగురిలో నలుగురు పనికిరానివారే

13 Apr, 2017 01:16 IST|Sakshi
ఐదుగురిలో నలుగురు పనికిరానివారే

► ఇంజనీర్‌ పట్టభద్రుల్లో నైపుణ్యాల కొరత 
► హెచ్‌డీఎఫ్‌సీ చీఫ్‌ దీపక్‌ పరేఖ్‌ వ్యాఖ్యలు


చెన్నై: ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను పెంచుకోవలసిన అవసరం ఉందని హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(హెచ్‌డీఎఫ్‌సీ) చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ చెప్పారు. విద్యార్ధులు కాలేజీల నుంచి పట్టభద్రులై బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసే విధంగా వారిని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు.

దేశంలో 3,300కు పైగా ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయని,  సగటున ప్రతీ ఏడాది 15 లక్షల మంది ఇంజినీరింగ్‌ పట్టభద్రులు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని, అయితే వీరిలో తగినన్ని నైపుణ్యాలు లేకపోవడం వల్ల ప్రతి ఐదుగురిలో నలుగురు ఉద్యోగాలు చేయడానికి పనికిరావడం లేదని పేర్కొన్నారు.  ఐఐటీ మద్రాస్‌లో దీపక్‌ పరేఖ్‌ ఇన్‌స్టిట్యూట్‌ చెయిర్‌ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ప్రపంచం వేగంగా మారుతోందని, అందుకనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులకు తగిన శిక్షణనివ్వాలని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు