జెట్‌ ఎయిర్‌వేస్‌లో మూడవ వికెట్‌ డౌన్‌

9 May, 2019 20:49 IST|Sakshi

సాక్షి, ముంబై : రుణ  సంక్షోభంలో చిక్కుకుని కార్యకలాపాలను మూసివేసిన విమానయాన సం‍స్థ జెట్ ఎయిర్‌వేస్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సంస్థ  పూర్తి కాలపు డైరెక్టర్‌  గౌరాంగ్‌ శెట్టి తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల రీత్యా జెట్‌ ఎయిర్‌వేస్‌ బోర్డు, సంస్థనుంచి వైదొలగుతున్నట్టు గురువారం ప్రకటించారు. ఏప్రిల్ 23 నుంచి అమలులోకి  వస్తుందని కంపెనీ  ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన  సమాచారంలో తెలిపింది. 

కాగా గత నెల  రోజుల కాలంలో ముగ్గురు   కీలక వ్యక్తులు సంస్థను వీడారు.  ప్రస్తుతం బోర్డులో రాబిన్‌ కామార్క్‌, అశోక్‌ చావ్లా, శరద్‌ మిగిలారు. ఇప్పటికే  ఇండిపెండెంట్‌  డైరెక్టర్‌ రాజశ్రీ పాతీ, అలాగే  మాజీ ఏవియేషన్‌ సెక్రటరీ, కంపెనీ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌  డైరెక్టర్‌ నసీం జైదీ  జెట్‌ ఎయిర్‌వేస్‌కు  గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు  జెట్‌ ఎయిర్‌వేస్‌కు దర్యాప్తు సంస్థల  రూపంలో మరో ప్రమాదం ముంచు కొస్తోంది. సీరియస్‌ ఫ్రాడ్‌  ఇన్వెస్టిగేషన్‌   జెట్‌ లో నిధుల మళ్లింపుపై దర్యాప్తును  ప్రారంభించనుందని సమాచారం. 

మరిన్ని వార్తలు