మళ్లీ భగ్గుమన్న బంగారం..

30 Mar, 2020 19:24 IST|Sakshi

ముంబై : స్టాక్‌మార్కెట్లు కుప్పకూలడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో హాట్‌ మెటల్‌ ధరలు భారమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ మహమ్మారి బారిన పడిన కేసులు పెరుగుతుండటం, ఆర్థిక మాంద్యం భయాలతో మదుపుదారులు బంగారంలో పెట్టుబడులకు మళ్లారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడికి డిమాండ్‌ పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ 229 ఎగిసి రూ 43,800 పలికింది. ఇక వెండి కిలో రూ 1059 తగ్గి రూ 39,835కు దిగివచ్చింది.

చదవండి : తీవ్ర ఆర్థికమాంద్యం, బంగారం కొనొచ్చా?

మరిన్ని వార్తలు