తీవ్ర ఒత్తిడిలో టెలికాం రంగం : సునీల్‌ మిట్టల్‌

19 Feb, 2020 21:55 IST|Sakshi

న్యూఢిల్లీ: గత ఐదేళ్లుగా దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతి ఎయిర్‌టెల్‌ అధినేత సునీల్‌ మిట్టల్‌ బుధవారం తెలిపారు. దేశ అభివృద్ధిలో టెలికాం రంగం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. టెలికం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిర్మాత్మకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద టెల్కోలు బకాయిలను చెల్లించాలని టెలికాం శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే.  సుప్రీంకోర్టు, ప్రభుత్వ డెడ్‌లైన్‌ల నేపథ్యంలో మొబైల్‌ దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ ప్రభుత్వానికి బకాయిపడిన రూ 10,000 కోట్లను టెలికాం శాఖకు చెల్లించింది. స్వయం మదింపు కసరత్తు పూర్తయిన తర్వాత మిగిలిన బకాయిల చెల్లింపు పూర్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు