ఆహార రిటైల్‌లో ఫ్లిప్‌కార్ట్‌కు నో ఎంట్రీ!

2 Jun, 2020 05:43 IST|Sakshi

కంపెనీ ప్రతిపాదన తిరస్కరించిన డీపీఐఐటీ

న్యూఢిల్లీ: ఆహారోత్పత్తుల రిటైల్‌ వ్యాపార విభాగంలో ప్రవేశించాలనుకున్న ఈ–కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను పరిశ్రమ, అంతర్గత వాణిజ్యం ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) తిరస్కరించింది. నియంత్రణపరమైన అంశాలు ఇందుకు కారణంగా పేర్కొంది. తాజా పరిణామాల నేపథ్యంలో పర్మిట్‌ కోసం మరోసారి దరఖాస్తు చేయాలని భావిస్తున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.

‘టెక్నాలజీ, నవకల్పనల ఆధారిత మార్కెట్‌ విధానాలతో దేశీయంగా రైతులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగానికి మరింత విలువ చేకూరుతుందని, సమర్థత, పారదర్శకత పెరుగుతుందని మేం విశ్వసిస్తున్నాం. చిన్న వ్యాపార సంస్థలకు ఊతమిచ్చే విధంగా పర్మిట్‌ కోసం మరోసారి దరఖాస్తు చేయాలని భావిస్తున్నాం‘ అని ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధి తెలిపారు. ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికాకు చెందిన రిటైల్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.  కంపెనీ గతేడాది దేశీయంగా ఆహార రిటైల్‌ విక్రయాల కోసం ఫ్లిప్‌కార్ట్‌ ఫార్మర్‌మార్ట్‌ పేరిట కొత్తగా విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు లైసెన్స్‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది.

మరిన్ని వార్తలు