జీఎస్‌టీ వసూళ్లు పేలవమే..!

2 Nov, 2019 05:40 IST|Sakshi

అక్టోబర్‌లో రూ.95,380 కోట్లు

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు అక్టోబర్‌లో 5.29 శాతం తగ్గాయి. రూ.95,380 కోట్లుగా నమోదయా్యయి. 2018 ఇదే నెల్లో ఈ వసూళ్లు రూ.1,00,710 కోట్లు. శుక్రవారం ప్రభుత్వం ఈ గణాంకాలను విడుదల చేసింది. జీఎస్‌టీ వసూళ్లు లక్ష కోట్లకన్నా తగ్గడం ఇది వరుసగా మూడవనెల. నిజానికి  పండుగల సీజన్‌ కావడంతో అక్టోబర్‌లో అయినా రూ. లక్ష కోట్లపైబడి జీఎస్‌టీ వసూళ్లు జరుగుతాయన్న అంచనా ఉంది.

అయితే ఈ అంచనాలూ తప్పడం ఆర్థిక వ్యవస్థలో మందగమనాన్ని ప్రతిబింబిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. సెపె్టంబర్‌లో జీఎస్‌టీ వసూళ్లు రూ.91,916 కోట్లు. గణాంకాల ప్రకారం కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..  స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.95,380 కోట్లు. అందులో సెంట్రల్‌ జీఎస్‌టీ వాటా రూ.17,582 కోట్లు. స్టేట్‌ జీఎస్‌టీ వాటా రూ.23,674 కోట్లు. ఇంటిగ్రేటెడ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (ఐజీఎస్‌టీ) రూ.46,517 కోట్లు. సెస్‌ రూ.7,607 కోట్లు.

అక్టోబర్‌లో తయారీ నీరసం!
తయారీ రంగం అక్టోబర్‌లో నిరాశను మిగిలి్చంది. ఐహెచ్‌ఎస్‌ మార్కెట్‌ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పీఎంఐ) 50.6 పాయింట్లుగా నమోదయ్యింది. గడచిన రెండేళ్లలో ఇంత తక్కువ స్థాయి సూచీ ఇదే తొలిసారి. సెపె్టంబర్‌లో ఈ సూచీ 51.4 వద్ద ఉంది. అయితే పీఎంఐ 50 పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది.

మరిన్ని వార్తలు