ఉద్యోగులను తీసేస్తున్న హైక్‌ మెసేంజర్‌

28 May, 2018 09:35 IST|Sakshi
హైక్‌ మెసేంజర్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : దేశీ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ ‘హైక్‌’ కూడా ఉద్యోగాల కోత చేపడుతోంది. తన వర్క్‌ఫోర్స్‌లో 20 శాతం నుంచి 25 శాతం ఉద్యోగులను హైక్‌ మెసేంజర్‌ తీసివేయడం ప్రారంభించింది. హార్డ్‌వేర్‌ మేకర్‌ క్రియో, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వెంచర్‌ ఇన్‌స్టాలైవ్లీల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికావడంతో, ఈ ప్రభావం ఉద్యోగులపై పడుతోంది. ఎక్కువగా ఉన్న ఉద్యోగులను పనితీరు కారణంతో కంపెనీ తీసేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు , దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో 50 నుంచి 75 మంది ఉద్యోగులు ఈ పునర్‌నిర్మాణ బారిన పడే అవకాశముందని తెలుస్తోంది. లేఆఫ్స్‌ విషయాన్ని హైక్‌ మెసేంజర్‌ అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. అయితే ఎంతమందిని తీసేస్తున్నారో మాత్రం అధికార ప్రతినిధి వెల్లడించలేదు. 

‘గతేడాది తాము కొన్ని కొనుగోళ్లు చేపట్టాం. దాంతో ఉద్యోగుల సైజ్‌ స్కైరాకెట్‌లో దూసుకుపోయింది. కొన్ని టీమ్‌లను కలిపేయడం, క్రమబద్ధం చేయడం చేస్తున్నాం. వ్యాపారాలు యథావిథిగా సాగుతాయి’ అని కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. మానవ వనరుల విభాగం, అకౌంటింగ్‌, ఫైనాన్స్‌ వంటి వాటిల్లో ఈ లేఆఫ్స్‌ ప్రక్రియ ఉండనుంది. తీసివేసే ఉద్యోగులకు రెండు నెలల శాలరీతో కూడా సెవరెన్స్‌ ప్యాకేజీని కూడా కంపెనీ అందించనుందని సంబంధిత వర్గాలంటున్నాయి. క్రియోను హైక్‌ గతేడాది ఆగస్టులోనే తన సొంతం చేసుకుంది. ఆ కొనుగోలు ప్రకటన సమయంలో క్రియోలో 50 మంది ఉద్యోగులున్నారు. ఇన్‌స్టాలైవ్లీ ఆపరేట్‌ చేసే పల్స్‌ అనే నెట్‌వర్కింగ్‌ యాప్‌ను కూడా 2017 ఫిబ్రవరిలో కొనుగోలు చేసింది. ఈ డెవలప్‌మెంట్లు జరిగిన ఐదు నెలల్లోనే ఢిల్లీ చెందిన హైక్‌ మెసేంజర్‌, కొత్త మొబైల్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను లాంచ్‌ చేసింది. డేటాను వాడకుండా మెసేజింగ్‌, రీఛార్జ్‌ చేసుకునే సర్వీసులను ఇది అందిస్తోంది. వాట్సాప్‌కు పోటీగా, లో ఎండ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లను టార్గెట్‌ చేసుకుని ఈ సర్వీసులను హైక్‌ మెసేంజర్‌ ఆఫర్‌ చేస్తోంది. 

మరిన్ని వార్తలు