హోమ్‌ క్రెడిట్‌ ఇండియా యాప్‌

8 May, 2017 06:31 IST|Sakshi
హోమ్‌ క్రెడిట్‌ ఇండియా యాప్‌

ప్రముఖ కన్సూమర్‌ ఫైనాన్స్‌ సంస్థ ‘హోమ్‌ క్రెడిట్‌’ తన పేరుతోనే ఒక యాప్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. ఫైనాన్షియల్‌ సర్వీసులను సరళతరం చేయడమే లక్ష్యంగా ఈ యాప్‌ను ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కాగా ‘హోమ్‌ క్రెడిట్‌ ఇండియా’ అనే ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు...
♦  తీసుకున్న రుణాల వివరాలను ఎప్పటికప్పుడు పొందొచ్చు.
♦ లోన్‌ సమరీ, రి–పేమెంట్‌ షెడ్యూల్‌ సమాచారాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అలాగే ఈ–మెయిల్‌ కూడా పంపుకోవచ్చు.
♦ ఇంకా ఎంత మొత్తం చెల్లించాలో చూసుకోవచ్చు. దాన్ని ఏ తేదీలోపు కట్టేయాలో కూడా తెలుసుకోవచ్చు.
♦  డెబిట్‌ కార్డు, నెట్‌ బ్యాంకింగ్‌ ఆప్షన్స్‌తో పేయూ ద్వారా ఈఎంఐ పేమెంట్స్‌ను వెంటనే కట్టేయవచ్చు.
♦  యూజర్‌కు సంబంధించిన మొబైల్‌ నెంబర్, ఈ–మెయిల్‌ వంటి తదితర వివరాలను అప్‌డేట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది.
♦ లోన్‌ నెంబర్‌ను ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ మొబైల్‌కు ఓటీపీని పొంద టం ద్వారా యాప్‌లోకి లాగిన్‌ అవ్వొచ్చు. తర్వాత యాప్‌లోకి మళ్లీ లాగిన్‌ అవ్వడం కోసం 4 డిజిట్ల పిన్‌ను సెట్‌ చేసుకోవచ్చు. 

మరిన్ని వార్తలు