పన్ను ఎగవేతదారుల నుంచి భారీగా నగదు

10 Feb, 2018 11:53 IST|Sakshi

పన్ను ఎగవేతదారులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీగానే చుక్కలు చూపిస్తోంది. బ్యాంకు ఖాతాలకు, రెండు లక్షలు దాటిన ఆర్థిక వ్యవహారాలకు పాన్‌ కార్డును తప్పనిసరి చేయడంతో, దాంతో పాటు ఆధార్‌ లింక్‌ చేయడం వంటి వాటితో పన్ను ఎగవేతదారులకు ప్రభుత్వం గండికొడుతోంది. తాజాగా అదనపు రిటర్నులలో రూ.1.7 కోట్ల ఫైల్‌ చేశారని, దీంతో మొత్తంగా ప్రభుత్వం డిసెంబర్‌ వరకు రూ.26,500 కోట్లు ఆర్జించినట్టు తెలిసింది. ఇన్‌-హౌజ్‌ సమాచారంతోనే నాన్‌-ఫైలర్స్‌ను ఆదాయపు పన్ను శాఖ గుర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంట్‌కు తెలిపారు. ఈ డేటాను టీడీఎస్‌, టీసీఎస్‌ ద్వారా సేకరించిన ఎక్కువ విలువ ఉన్న లావాదేవీలతో ట్యాలీ చేస్తున్నారని పేర్కొన్నారు.  

ప్రస్తుతం పాన్‌ నెంబర్‌ను రూ.2 లక్షలకు పైన జరిపే లావాదేవీలు ప్రాపర్టీ, షేర్లు, బాండ్లు, ఇన్సూరెన్స్‌, విదేశీయ ప్రయాణం వంటి అన్నింటికీ తప్పనిసరి చేసినట్టు చెప్పారు. గతేడాది 35 లక్షల నాన్‌-ఫైలర్స్‌ను గుర్తించామని, ఆ ముందటేడాది ఈ సంఖ్య 67 లక్షలుగా ఉండేదని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. నాన్‌-ఫైలర్స్‌ను గుర్తించిన అనంతరం పలు కేటగిరీలోకి కేసులను వర్గీకరించి, మానిటర్‌ చేస్తున్నట్టు అరుణ్‌జైట్లీ తెలిపారు. రిటర్నులు ఫైల్‌ చేయాలని టార్గెట్‌ చేసిన గ్రూప్‌లుకు టెక్ట్స్‌ మెసేజ్‌లు, ఈమెయిల్స్‌ను పంపుతున్నట్టు కూడా పేర్కొన్నారు. వారి స్పందనలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రాజెక్ట్‌ ఇన్‌సైట్‌ అనే కొత్త మెకానిజం ద్వారా మరింత కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు