హెచ్‌యూఎల్‌ లాభం రూ.1,795 కోట్లు

24 Jul, 2019 08:44 IST|Sakshi

14% వృద్ధి ∙6% వృద్ధితో రూ.10,197 కోట్లకు ఆదాయం  

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌(హెచ్‌యూఎల్‌) ఈ ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌లో రూ.1,795 కోట్ల నికర లాభం సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఆర్జించిన నికర లాభం, రూ.1,569 కోట్లతో పోల్చితే 14 శాతం వృద్ధి సాధించామని హెచ్‌యూఎల్‌ తెలిపింది. అమ్మకాలు పెరగడం, మార్జిన్ల మెరుగుదల కారణంగా నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ మెహతా తెలిపారు. నికర అమ్మకాలు రూ.9,616 కోట్ల నుంచి 6 శాతం వృద్ధితో రూ.10,197 కోట్లకు పెరిగాయని పేర్కొంది.విభాగాల వారీగా చూస్తే, హోమ్‌ కేర్‌ సెగ్మెంట్‌ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.3,464 కోట్లకు, బ్యూటీ, పర్సనల్‌ కేర్‌ విభాగం ఆదాయం 4 శాతం వృద్ధివతో రూ.4,626 కోట్లకు, ఫుడ్స్‌ అండ్‌ రిఫ్రెష్‌మెంట్‌ విభాగం 9 శాతం లాభంతో రూ.1,950  కోట్లకు పెరిగాయని రామన్‌ వివరించారు. 

మెరుగుపడిన మార్జిన్లు....
కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చామని, పటిష్టమైన నియంత్రణ పద్ధతుల కారణంగా మార్జిన్లు పెరిగాయని హెచ్‌యూఎల్‌ సీఎండీ సంజీవ్‌ మెహతా పేర్కొన్నారు. జీఎస్‌కే కన్సూమర్స్‌ హెల్త్‌కేర్‌ను హెచ్‌యూఎల్‌లో విలీనం చేయడానికి వాటాదారులు ఆమోదం తెలిపారని, ఈ ఏడాది చివరికల్లా ఈ విలీనం పూర్తవ్వగలదని పేర్కొన్నారు.  
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హిందుస్తాన్‌ యూనిలివర్‌ షేర్‌ 0.8 శాతం లాభంతో రూ.1,693 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హైదరాబాద్‌లో పేపాల్‌ టెక్‌ సెంటర్‌

జగన్‌! మీరు యువతకు స్ఫూర్తి

బీఎస్ఎన్‌ఎల్‌ స్టార్‌ మెంబర్‌షిప్‌ : ఏడాదికి రూ.498

ఎల్‌ అండ్‌ టీ లాభం రూ.1,473 కోట్లు

2018–2019కు ఐటీఆర్‌ ఫైలింగ్‌ గడువు పొడిగింపు

హ్యుందాయ్‌ కార్ల ధరలు మరింత ప్రియం

జీడీపీ వృద్ధి రేటు ‘కట్‌’కట!

ఫార్చూన్‌ ఇండియా 500లో ఆర్‌ఐఎల్‌ టాప్‌

‘ఇల్లు’ గెలిచింది..!

మహీంద్ర ట్వీట్‌.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు

రూ 1999కే ఆ నగరాలకు విమాన యానం

అనిల్‌ అంబానీ కంపెనీల పతనం

మార్కెట్ల రీబౌండ్‌

మరో సంచలనానికి సిద్ధమవుతున్న జియో

క్రిప్టోకరెన్సీ అంటే కఠిన చర్యలు

టీఎస్‌ఎస్‌ గ్రూప్‌లో ఆర్‌వోసీ సోదాలు!

ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్‌’

లాభాల బాటలోనే ఓబీసీ..

ఆమ్రపాలి గ్రూపునకు సుప్రీం షాక్‌

బజాజ్‌ సీటీ 110 @: రూ.37,997

టీవీఎస్‌ మోటార్‌ లాభం 6 శాతం డౌన్‌

హైదరాబాద్‌లో వన్‌ప్లస్‌ అతిపెద్ద స్టోర్‌

కోటక్‌ బ్యాంక్‌ లాభం 1, 932 కోట్లు

బజాజ్‌తో వన్‌ ప్లస్‌ ఇండియా ఒప్పందం

నష్టాల్లోకి జారుకున్న స్టాక్‌మార్కెట్లు

ఫార్చూన్‌ 500లో షావోమి

జీవితకాల గరిష్టస్థాయికి పసిడి

పేమెంట్‌ బ్యాంకులు... ప్చ్‌!

64 ఎంపీ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌

బజాజ్‌ ఆటో కొత్త బైక్‌ : రూ.38 వేలు 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రతి రోజూ పరీక్షే!

బిగ్‌బాస్‌.. ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే?

‘సైరా’లో ఆ సీన్స్‌.. మెగా ఫ్యాన్స్‌కు పూనకాలేనట

బాలీవుడ్‌కు ‘డియర్‌ కామ్రేడ్‌’

‘నా కొడుకు నా కంటే అందగాడు’

అందుకే హాలీవుడ్‌లో నటించలేదు: అక్షయ్‌