బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌: లక్షమందికి నోటీసులు

9 Feb, 2018 11:44 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :   వివాదాస్పద  క్రిప్టో కరెన్సీపై  కేంద్రప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది.  ఇప్పటికే బడ్జెట్‌  ప్రసంగంలో బిట్‌కాయన్‌ చట్టబద్ధత లేదని  కేంద్ర మంత్రి అరుణ​ జైట్లీ ప్రకటించిన  నేపథ్యంలో ఐటీ శాఖ అధికారులు  బిట్‌కాయన్‌ భారీగా పెట్టుబడులు పెట్టిన భారతీయపెట్టుబడిదారులపై కన్నేశారు.   లక్ష మందికి నోటీసులు జారీ చేసినట్టు  ప్రకటించింది

బిట్‌కాయిన్ లాంటి క్రిప్టోకరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన సుమారు లక్ష మంది భారతీయ ఇన్వెస్టర్లకు   లక్షమందికి  నోటీసులిచ్చామని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరక్ట్ ట్యాక్సెస్ చైర్మన్ సుశీల్ చంద్ర తెలిపారు.  బిట్‌ కాయన్‌లో పెట్టుబడుల ద్వారా లాభాలు సాధించి,     ఆదాయ వివారాల్లో లెక్కల  చూపని వారికి ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. ఈ వర్చువల్ కరెన్సీ వినియోగంపై సీబీడీటీ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించిందనీ,  గత 17 నెలల్లో దేశవ్యాప్తంగా క్రిప్టోకోర్టోవెన్సీ ఎక్స్ఛేంజీలలో 3.5 బిలియన్ డాలర్ల లావాదేవీలను గుర్తించామని వెల్లడించారు.. చాలా మంది క్రిప్టోలో ఇన్వెస్ట్ చేశారని, కానీ ఆ అంశాన్ని తమ ఐటీ ఫైలింగ్‌లో చూపించలేదని, ఈ పెట్టుబడుల ద్వారా వచ్చిన ఆదాయంపై పన్ను కట్టలేదని  తెలిపారు.
 

మరిన్ని వార్తలు