అక్కడి నుంచి భారీగా బంగారం దిగుమతి

14 Aug, 2017 18:02 IST|Sakshi
అక్కడి నుంచి భారీగా బంగారం దిగుమతి
పనాజీ : ఇటీవల అమల్లోకి వచ్చిన కొత్త పన్ను విధానం బంగారం దిగుమతులకు భారీగా కలిసివస్తోంది. పన్ను విధానంలో వచ్చిన ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని జూలై, ఆగస్టు కాలంలో దక్షిణ కొరియా నుంచి భారతీయ వర్తకులు 25 టన్నుల మేర బంగారాన్ని దిగుమతి చేసుకోనున్నట్టు దేశీయ అధికారులు చెప్పారు. ఈ మేరకు వీటికి 10 శాతం కస్టమ్స్‌ డ్యూటీని కూడా వర్తకులు చెల్లించాల్సినవరం లేకపోవడం ఈ దిగుమతులకు మరింత సహకరిస్తోందని పేర్కొన్నారు. జీఎస్టీ అమలు తర్వాత ఇప్పటికే 12 టన్నుల బంగారం దక్షిణకొరియా నుంచి భారత్‌లోకి ప్రవేశించిందని, ఈ నెల ఆఖరికి ఇది కాస్త 25 టన్నుల మేర పెరిగే అవకాశముందని అసోసియేషన్‌ ఆఫ్‌ గోల్డ్‌ రిఫైనరీస్‌ అండ్‌ మింట్స్‌ సెక్రటరీ జేమ్స్‌ జోష్‌ తెలిపారు. చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగార వినియోగదారునిగా ఉన్న భారత్‌, బంగారంపై 10 శాతం ఇంపోర్టు డ్యూటీని విధిస్తోంది‌. కానీ దక్షిణ కొరియా లాంటి దేశాలతో చేసుకున్న ఉచిత వాణిజ్య ఒప్పందాల ప్రకారం ఈ డ్యూటీ లేదు. 
 
ఆయా దేశాల దిగుమతులపై డ్యూటీలను మినహాయించడానికి అంతకముందు 12.5 శాతం ఎక్సైజ్‌ డ్యూటీని భారత్‌ విధించింది. ఎప్పుడైతే జీఎస్టీ అమల్లోకి వచ్చిందో ఇక అప్పటి నుంచి అన్ని స్థానిక పన్నులు కనుమరుగయ్యాయి. కేవలం ఒక్క జీఎస్టీ మాత్రమే అమలువుతోంది. భారత్‌తో ఎఫ్‌టీఏలు కలిగి ఉంది కాబట్టే ఇతర దేశాలతో పోలిస్తే, దక్షిణ కొరియానే బంగారం దిగుమతులకు అనుకూలంగా ఉంటోందని తెలిసింది. ఇంపోర్టు డ్యూటీ లేని కాయిన్లు, ఇతర ఆర్టికల్స్‌ రూపంలో బులియన్‌ను డెలివరీ చేసుకుంటున్నారని వెల్లడైంది. ఈ నెల మొదట్లో బంగారంపై డిస్కౌంట్లు కూడా ఔన్స్‌కు 11 డాలర్లు ఉంది. ఇది 10 నెలల కాలంలో అ‍త్యధికం. 2017 తొలి ఏడు నెలల కాలంలో బంగారం దిగుమతులు గతేడాది కంటే రెట్టింపయ్యాయని కన్సల్టెన్సీ జేఎఫ్‌ఎంఎస్‌ ప్రొవిజనల్‌ డేటాలో వెల్లడైంది. 
 
మరిన్ని వార్తలు