టుడే న్యూస్‌ రౌండప్‌ | Sakshi
Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Mon, Aug 14 2017 5:19 PM

today news roundup

సాక్షి, హైదరాబాద్‌: ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టే ప్రతీ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఎర వేస్తున్నారని వైఎస్సాఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆరో రోజు నంద్యాల ఏటీఏం సెంటర్ లో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన ప్రసంగించారు. మరోవైపు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నించారు.  తెలంగాణ వార్తల్లోకి వస్తే తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాటే తుది నిర్ణయమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా స్పష్టం చేశారు. మరిన్ని వార్తలు మరోసారి మీకోసం..



<<<<<<<<<<<<<<<<<<<<<<రాష్ట్రీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

చంద్రబాబుకు కళ్లు తలకెక్కాయి: వైఎస్‌ జగన్‌
ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టే ప్రతీ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు ఎర వేస్తున్నారని వైఎస్సాఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి తెలిపారు.

‘మా పార్టీలో ఆయన మాటే ఫైనల్‌’
తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాటే తుది నిర్ణయమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్‌సీ కుంతియా స్పష్టం చేశారు.

టీడీపీలో కుమ్ములాటలు
జిల్లా టీడీపీలో అసంతృప్తి తీవ్రతరమైంది.

మరోసారి ముద్రగడ పాదయాత్ర యత్నం!
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సోమవారం మరోసారి పాదయాత్ర చేపట్టేందుకు ప్రయత్నించారు.

మళ్లీ డ్రగ్స్ రాకెట్ కలకలం
నగరంలో మరో డ్రగ్స్ దందా వెలుగు చూసింది.

<<<<<<<<<<<<<<<<<<<<<<జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

ఎన్సీపీ కూడా ‘చెయ్యి’స్తుందా?
ప్రతిపక్షాల కూటమి నుంచి శరద్‌ యాదవ్‌ నాయకత్వంలోని ఎన్సీపీ తప్పుకోనుందని ఊహాగానాలు బయల్దేరాయి.

గోరఖ్‌పూర్‌ ఘోరం ఎవరి నేరం?
ఉత్తరప్రదేశ్, గోరఖ్‌పూర్‌ జిల్లా కేంద్రంలోని బాబా రఘుదాస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత కారణంగా గత మూడు రోజుల్లో 70 మంది పిల్లలు అకాల మత్యువాత పడిన విషయం తెల్సిందే.

పాక్‌,భారత్‌ జాతీయగీతాలు కలిసికట్టుగా..!
ఒక్క రోజు తేడాతో పాకిస్తాన్‌, భారత్‌లు స్వతంత్ర దేశాలుగా అవిర్భవించి, గడిచిన 70 ఏళ్లలో అంతకంతకూ దూరమవుతూ వచ్చాయి.

లండన్‌ టు ముంబయి....
బ్యాంకులకు కోట్లాది రూపాయల రుణాలను ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న విజయ్‌ మాల్యాను తిరిగి రప్పించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి.

<<<<<<<<<<<<<<<<<<<<<<అంతర్జాతీయం>>>>>>>>>>>>>>>>>>>>>>>

భారత టెకీలే టార్గెట్‌...
ఇమిగ్రేషన్‌ విధానాలపై అమెరికాలో ఇటీవల జరిగిన సమీక్షా భేటీలో భారతీయ కంపెనీలు, ఉద్యోగులను టార్గెట్‌ చేయడం పట్ల ఆందోళన వ్యక్తమవుతున్నది.

'మా బంధం తేనె కంటే తియ్యనైనది'
పాకిస్తాన్‌తో తమ అనుబంధం స్టీల్‌ కంటే ధృడమైనదని, తేనె కంటే తియ్యనైనదని పాకిస్తాన్‌ స్వతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమంలో చైనా వైస్‌ ప్రీమియర్‌ వాంగ్‌ యాంగ్‌ అన్నారు.

భారత్‌పై డ్రాగన్‌ బుసలు‌: ట్రేడ్‌ వార్‌ ప్రారంభం
ఇటీవల డొక్లామ్‌ వివాదానంతరం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు చైనా తనదైన శైలిలో వార్నింగ్‌లు ఇస్తూనే ఉంది.

<<<<<<<<<<<<<<<<<<<<<<బిజినెస్‌>>>>>>>>>>>>>>>>>>>>>>

అంబానీకి భారీ ఊరట
అనీల్ అంబానీ రిలయన్స్ గ్రూప్ లో భాగమైన టెలికమ్యూనికేషన్స్ క్యారియర్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ టెలికం టవర్ల బిజినెస్‌ విక్రయంలో విజయం సాధించింది.

హోండాకు ఝలక్‌: హీరో కొత్త స్కూటర్లు
ద్విచక్ర వాహన తయారీదారు హీరో మోటోకార్ప్ సరికొత్త వ్యూహంతో స్కూటర్ల విభాగంలో ప్రత్యర్థి హోండాకు గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

ఇండిపెండెన్స్‌ డే స్పెషల్‌గా నోకియా 5 సేల్‌
నోకియా 5 బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌ ఎట్టకేలకు కస్టమర్ల చేతిలోకి వచ్చేస్తోంది.

ఇండిగో స్పెషల్‌​ ఆఫర్‌
ప్రైవేట్ క్యారియర్ ఇండిగో స్పెషల్‌ ప్రమోషనల్‌ ఆఫర్‌ను లాంచ్‌ చేసింది.

<<<<<<<<<<<<<<<<<<<<<<సినిమా>>>>>>>>>>>>>>>>>>>>>>>

రజనీ, కమల్‌ ఎవరైనా రాజకీయాల్లొకి రావొచ్చు
రజనీకాంత్, కమలహాసన్‌ ఇలా ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చునని, అయితే వచ్చిన తరువాత నూరు శాతం అంకిత భావం కలిగి ఉండాలని హాస్యనటుడు వివేక్‌ వ్యాఖ్యానించారు.

డిజాస్టర్ల నడుమ ఆ సినిమాకు భారీ వసూళ్లు!
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ ఆశలను నిలబెట్టింది.

వ్యక్తులకు వేరైనా.. దేశానికి ఒక్కటే: పవన్‌ కల్యాణ్‌
వ్యక్తులకు భిన్నమైన పర్వదినాలు ఉండొచ్చు. కానీ జాతికి సంబంధించి ఇదొక్కటే ఘనమైన పండుగ రోజు. జైహింద్‌!' అని పవన్‌ కల్యాణ్‌..

<<<<<<<<<<<<<<<<<<<<<<క్రీడలు>>>>>>>>>>>>>>>>>>>>>>>

విరాట్ సేన 'తొలి' చరిత్ర
విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది.

ఎనిమిదేళ్ల తరువాత పాక్ లో పర్యటన
గత ఎనిమిదేళ్లుగా తమ దేశంలో క్రికెట్ మ్యాచ్ లను ఆడించేందుకు యత్నిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఎట్టకేలకు సఫలమైంది.

వాటిని పట్టించుకోను: హార్దిక్
ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడుతున్న మూడో మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement