రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు

2 May, 2015 00:07 IST|Sakshi
రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు

ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. ఏప్రిల్ 24తో ముగిసిన వారానికి 344.6 బిలియన్ డాలర్లకు ఎగసాయి.  అంతక్రితం వారంతో (ఏప్రిల్ 17) పోల్చిచూస్తే, ఇవి 1.4 బిలియన్ డాలర్లు అధికం. రిజర్వ్ బ్యాంక్ సమాచారం ప్రకారం...
విదేశీ కరెన్సీ అసెట్స్‌గా(ఎఫ్‌సీఏ) పరిగణించే డాలర్ల పరిమాణం 1.4 బిలియన్ డాలర్లు ఎగసి, 320.26 బిలియన్ డాలర్లకు చేరింది.
బంగారం నిల్వల విలువ స్థిరంగా 19.03 బిలియన్ డాలర్ల వద్ద ఉంది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ స్వల్పంగా 0.2 మిలియన్ డాలర్లు ఎగసి, 4 బిలియన్ డాలర్లకు చేరాయి.

మరిన్ని వార్తలు