విత్డ్రాయెల్స్పై పరిమితితో పరిశ్రమలకు దెబ్బ

15 Nov, 2016 01:32 IST|Sakshi
విత్డ్రాయెల్స్పై పరిమితితో పరిశ్రమలకు దెబ్బ

కోయంబత్తూర్: కరెన్సీ నోట్ల రద్దు నేపథ్యంలో క్యాష్ విత్‌డ్రాయెల్స్‌పై కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడం వల్ల రియల్టీ సహా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎస్‌ఎంఈ) రంగాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆయా పరిశ్రమ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీకి రాసిన ఒక మెమోరాండంలో లోకల్ చాప్టర్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఐసీసీఐ).. విత్‌డ్రాయెల్స్‌పై పరిమితి అంశంపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేసింది.

దీని వల్ల పరిశ్రమకు సంబంధించిన దైనందిన కార్యకలాపాలు దెబ్బతింటాయని పేర్కొంది. ఎస్‌ఎంఈలు వాటి కార్యకలాపాల కోసం నగదు లావాదేవీలపైనే ప్రధానంగా ఆధారపడతాయని ఐసీసీఐ ప్రెసిడెంట్ వనిత మోహన్ గుర్తుచేశారు. తాజా పరిమితుల వల్ల ఇవి సమస్యలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. దీంతో మొత్తంగా ఉత్పత్తి తగ్గొచ్చని అభిప్రాయపడ్డారు. వి కార్మికులు వేతన చెల్లింపులు ఆలస్యం కావొచ్చని తెలిపారు.

 ‘కార్మికులందరికీ బ్యాంక్ ఖాతాలు ఉండవు. వారికి తప్పనిసరిగా నగదు రూపంలోనే వారం చివరిలో చెల్లింపులు జరపాలి. ఇప్పుడు వారు ఈ వారంలో పేమెంట్స్‌ను కోల్పోయే పరిస్థితి వచ్చింది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా ఈ మెమోరాండంలో తొమ్మిది టెక్స్‌టైల్ అసోసియేషన్‌‌స, పలువురు మ్యానుఫ్యాక్చరర్స్ సహా రియల్టర్ల సమాఖ్య క్రెడాయ్ సంతకాలు చేశారుు.

>
మరిన్ని వార్తలు