ఇన్ఫోసిస్‌కు మరో షాక్‌

12 Dec, 2019 20:31 IST|Sakshi

ఇన్ఫోసిస్‌పై దావా వేయనున్నట్లు లాస్‌ ఏంజిల్స్‌కు చెందిన షాల్ లా ఫర్మ్‌ (షేర్‌ హోల్డర్స్‌ హక్కుల సంస్థ) ప్రకటించింది. స్వల్పకాలిక లాభాలను అర్జించడానికి ఇన్ఫోసిస్‌ తప్పుడు ప్రకటనలు చేసిందని ఫిర్యాదులో పేర్కొంది. అకౌంటింగ్‌ సమీక్షలను ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌ దాటవేస్తున్నాడని తెలిపింది. అకౌంటింగ్‌ వివరాలను మేనేజ్‌మెంట్‌ ఒత్తిడితో ఫైనాన్స్‌ విభాగం దాచిందని ఫిర్యాదులో తెలిపింది. ఇన్ఫోసిస్‌కు సంబంధించిన ఫిర్యాదుల నేపథ్యంలో మార్కెట్‌లో ఇన్ఫోసిస్‌ ఇన్వెస్టర్లు నష్టపోయారని వెల్లడించింది.

జులై 7 2018 నుంచి అక్టోబర్‌ 20, 2019 వరకు సెక్యూరిటీస్‌ కొన్న ఇన్వెస్టర్లు షాల్ లా ఫర్మ్ సంస్థను సంప్రదించవచ్చని పేర్కొంది. షాల్ లా ఫర్మ్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా వాటాదారులు, షేర్‌ హోల్డర్స్‌ హక్కుల కోసం పోరాడుతున్న విషయం విదితమే. గత కొంత కాలంగా ఇన్ఫోసిస్‌ సీఈవో సలీల్‌ పరేఖ్‌పై విజిల్‌ బ్లోయర్ల (ప్రజావేగుల) ఫిర్యాదుల పరంపర కొనసాగింది. కానీ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలేవంటూ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు