ఇంటర్నెట్‌ను బ్రేక్‌ చేస్తున్న జియో ఇన్‌స్టిట్యూట్‌

11 Jul, 2018 13:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో ఐదు ఉన్నత విద్యాసంస్థలతో పాటు, కనీసం భవనం కూడా లేని ‘జియో ఇన్‌స్టిట్యూట్‌’ కు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కల్పించిన ‘ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమినెన్స్‌ (ఘనత వహించిన లేదా అత్యున్నత)’ హోదా సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ‘జియో ఇనిస్టిట్యూట్‌’కు ఆ హోదా ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు కేంద్రం మూగబోయింది. ఈ విమర్శల నుంచి తప్పించుకోవడానికి గ్రీన్‌ఫీల్డ్‌ కేటగిరీ కింద జియోకు ఈ స్టేటస్‌ ఇ‍చ్చామంటూ చెప్పుకొచ్చింది. కానీ విమర్శల వర్షం మాత్రం ఆగడం లేదు. మరోవైపు ఈ అంశం ఇంటర్నెట్‌ను సైతం బ్రేక్‌చేస్తోంది. దీనిపై ఇంటర్నెట్‌లో జోకులు పేలిపోతున్నాయి. 

కనీసం భవనం కూడా జియో కాలేజీకి ప్రతి రోజూల వంద మంది విద్యార్థులు అహ్మదాబాద్‌లో బుల్లెట్‌ ట్రైన్‌ పట్టుకుని బాంబే వెళ్తున్నారని ఓ యూజర్‌ కామెంట్‌ పెట్టాడు. లాక్ మకోలే & లార్డ్ అంబానీలు భక్తులలో అక్షరాస్యత పెంచడానికి భారతదేశంలో జియో ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించాలని ప్రణాళిక వేశారు(1838).. అని మరో యూజర్‌ జోక్‌ చేశాడు. నాసా, యునెస్కోలు జియో ఇన్‌స్టిట్యూట్‌ను సర్టిఫైడ్‌ చేశాయా?.. జియో ఇన్‌స్టిట్యూట్‌ గురించి నొక్కి వక్కాణిస్తున్న ప్రతి ఒక్కరికీ తెలియదేమో..సహజ పర్యావరణ వాతావరణంలో చదువుకుంటే జ్ఞానం వస్తుందని.. ఇలా కామెంట్లు పెడుతూనే ఉన్నారు. జియో ఇన్‌స్టిట్యూట్‌పై వస్తున్న కామెంట్లు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి మీరే చూడండి .... 

మరిన్ని వార్తలు