వాణిజ్య వాహనాలపై ఇంధన ధరల ప్రభావం

13 Oct, 2018 01:11 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వర్షాభావం, ఇంధన ధరల పెరుగుదల వాణిజ్య వాహనాల మీద ప్రభావం ఉంటుందని.. దీంతో అమ్మకాలు కాస్త నెమ్మదించే అవకాశముందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఆటోమోటివ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) మహేశ్‌ కులకర్ణి చెప్పారు. దేశంలో ఏటా 2.20 లక్షల పికప్‌ వాహనాలు విక్రయమవుతున్నాయని.. వీటిల్లో మహీంద్రా వాటా 62 శాతం వరకు ఉంటుందని  తెలిపారు.

ఏటా మహీంద్రా నుంచి 12 వేల వాహనాలను విక్రయిస్తున్నామని చెప్పారు. 60 శాతం అమ్మకాలు వ్యవసాయ, సర్వీసెస్‌ విభాగం నుంచి ఉంటాయని తెలిపారు. ‘మహా బొలెరో’ వాహనాన్ని శుక్రవారమిక్కడ విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. మహీంద్రా వాణిజ్య వాహనాల మొత్తం అమ్మకాల్లో 28 శాతం బొలెరో వాటా ఉంటుందన్నారు.  

విపణిలోకి మహా బొలెరో:  మహీంద్రా అండ్‌ మహీంద్రా తాజాగా విపణిలోకి మహా బొలెరో పికప్‌ వాహనాన్ని విడుదల చేసింది. 1.3 నుంచి 1.7 టన్నుల వరకు 3 రకాల వాహనాలు అందుబాటులో ఉంటాయి. వీటి ధరలు రూ.6.68 లక్షల నుంచి రూ.6.90 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జోనల్‌ సౌత్‌ హెడ్‌ మనోజ్‌ కుమార్‌ గుప్తా పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు