స్టాక్‌ మార్కెట్లకు భారీ నష్టాలు

3 Sep, 2019 13:33 IST|Sakshi

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసంలో జీడీపీ వృద్ధి ఐదు శాతానికి పరిమితమైందనే గణాంకాలతో స్టాక్‌ మార్కెట్లు కుదేలయ్యాయి. జీడీపీ వృద్ధి రేటుతో పాటు అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌ భయాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ఆర్థిక మందగమనాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించినా మదుపుదారులు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొనడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 460 పాయింట్ల నష్టంతో 36,872 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 143 పాయింట్ల నష్టంతో 10,879 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు