అందుకే అట్లాంటిక్‌తో భాగస్వామ్యం: ఆకాశ్‌ అంబానీ

18 May, 2020 11:19 IST|Sakshi

ముంబై: పారిశ్రామిక దిగ్గజం ముఖేష్‌ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 873 డాలర్ల వాటాను జనరల్‌ అట్లాంటిక్‌ సంస్థకు అమ్మి ఈ సంస్థతో భాగస్వామ్యం కావడంపై ఆయన తనయుడు, రిలయన్స్‌ జియో డైరెక్టర్‌ ఆకాశ్‌ అం‍బానీ ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై ఆకాశ్‌ మాట్లాడుతూ.. ‘భారతదేశంలోని భారతీయులంతా డిజిటల్ సాధికారత పొందేందుకు చేస్తున్న మా ప్రయత్నంలో జనరల్ అట్లాంటిక్ వంటి ప్రఖ్యాత గ్లోబల్ ఇన్వెస్టర్‌లు మాతో భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. దీంతో మార్చి 2021కు ముందే రిలయన్స్ 20 బిలియన్‌ డాలర్ల నికర రుణాన్ని చెల్లించాలని పెట్టుకున్న గడువుకు ఈ నిధులు మద్దతు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. (జియో ప్లాట్‌ఫామ్స్‌లో నాలుగో భారీ పెట్టుబడి)

కాగా జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటేడ్‌ పెట్టుబడులను విస్తరించేందుకు అంబానీ ఎయిర్‌బిన్‌బీ ఐఎన్‌సీ, ఉబెర్‌ టెక్నాలీస్‌ల మొదటి పెట్టుబడుల సంస్థ అట్లాంటిక్‌కు 873 మిలియన్‌ డాలర్ల వాటాను అమ్మిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు 1.3 శాతం వాటాను తీసుకోవడానికి మరో విదేశీ సంస్థ ముందుకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆమెరికా ఆధారిత సంస్థ అయిన ఈక్విటీ ఫండ్‌.. అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ డిజిటల్‌ సేవల కోసం 1.16 ట్రిలియాన్‌ డాలర్లు(68 బిలియన్‌ డాలర్ల) ఎంటర్పైజ్‌ విలువను నిర్థేశిస్తున్నట్లు ఆదివారం ముంబైకి చెందిన ఓ కంపెనీ తెలిపింది. అంతేగాక బ్లూమ్‌బర్గ్‌ న్యూస్‌ ద్వారా జనరల్‌ అట్లాంటిక్‌ సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. (2033 నాటికి ముకేశ్‌ సంపద.. లక్ష కోట్ల డాలర్లు!)

కాగా రిలయన్స్‌ జియో ప్లాట్‌ఫామ్స్‌లో 1.34 శాతం వాటా కోసం ఈక్విటీ సంస్థ, జనరల్‌ అట్లాంటిక్‌ రూ.6,598 కోట్లు ఇన్వెస్ట్‌ చేయడంతో నాలుగు వారాల్లో ఇది నాలుగో డీల్, ఈ నాలుగు ఒప్పందాల ద్వారా జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.67,195 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. జనరల్‌ అట్లాంటిక్‌ డీల్‌ పరంగా చూస్తే, జియో ప్లాట్‌ఫామ్స్‌ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగాను, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5.16 లక్షల కోట్లుగానూ ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు