రానున్న రోజుల్లో 23వేల స్థాయికి నిఫ్టీ బ్యాంక్‌..!?

3 Jun, 2020 11:16 IST|Sakshi

ఎల్‌పీకే సెక్యూరిటీస్‌ సాంకేతిక నిపుణుడు గౌరవ్‌ బిస్సా

రానున్న రోజుల్లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 23,000-24,000 శ్రేణిని అందుకునే అవకాశం ఉందని ఎల్‌పీకే సెక్యూరిటీస్‌ సంస్థ టెక్నికల్‌ నిపుణుడు గౌరవ్‌ బిస్సా అభిప్రాయపడ్డారు. వీక్లీ ఛార్ట్‌లో ఇండెక్స్‌ ‘‘సీ క్లాంప్‌’’ ప్యాట్రన్‌ రూపొందించిందని ఈ ప్యాట్రన్‌ సాధారణంగా ఓవర్‌బాట్‌/ఓవర్‌సోల్డ్‌ కు సంకేతమని గౌరవ్‌ బిస్సా తెలిపారు. వీక్లీ ఛార్ట్‌లో ఈ ప్యాట్రన్‌ ఫార్మేషన్‌ వచ్చే వారాల్లో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 23000-24000 స్థాయిని అందుకునేందుకు అవకాశాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన తెలిపారు. ఇండెక్స్‌ బుల్లిష్‌ డ్రాగన్‌ హార్మోనిక్‌ ప్యాట్రన్‌ను కూడా నమోదు చేసింది. ఇది సహజ సిద్ధమైన రివర్సల్‌ ప్యాట్రన్‌ను సూచిస్తుంది. 


‘‘బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ నెలవారీ ఛార్ట్‌ను పరిశీలిస్తే...  ‘ఇచిమోకు’ క్లౌడ్ ఏరియాలో ప్రవేశించిన ప్రతిసారీ బౌన్స్ అవుతుంది. 2008-2009లో మొదటిసారిగా ఈ క్లౌడ్ ఏరియాలోకి ప్రవేశించిన తరువాత ఇండెక్స్‌ సరికొత్త జీవిత స్థాయిని అందుకుంది. అలాగే 2013లో ఒకసారి ఇదే ఏరియాలోకి ప్రవేశించింది. అనంతరం కొన్ని నెలల తరువాత కొత్త లైఫ్‌టైం స్థాయిని అందుకుంది. ఇప్పుడు తాజాగా మూడోసారి ఈ ‘ఇచిమోకు’ క్లౌడ్‌ ఏరియాలోకి ప్రవేశించింది. ఈ క్లౌడ్‌ ఏరియా ప్రాంతం కిందకు వెళ్లినప్పటికీ.., దాని లోపల ముగిసింది. దీనిని సానుకూల సంకేతంగా తీసుకోవచ్చు. అందువల్ల 18,600 స్థాయి కంటే దిగువ స్థాయికి రానంత వరకు ఇండెక్స్‌ ర్యాలీ చేసేందుకు అవకాశం ఉంది.’’ అని బిస్సా తెలిపారు.

బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ జనవరిలో 32వేల స్థాయిని అందుకుంది. అనంతరం ఆర్థిక వృద్ధి మందగమనం, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ విధింపు పరిణామాలతో ఈ ఇండెక్స్‌ 32వేల గరిష్టం నుంచి కరెక‌్షన్‌ అయ్యి ఏప్రిల్‌లో 16,000-17,000 స్థాయి రేంజ్‌లో కదలాడింది. బ్యాంక్‌ నిప్టీ ఇండెక్స్‌లోని షేర్లు నిరంతరం ఒత్తిడికి లోనవడంతో నిఫ్టీ-50 ఇండెక్స్ అధిక స్థాయిని అందుకోవడంలో విఫలమైంది.  గత కొన్ని ట్రేడింగ్‌ సెషన్ల నుంచి ఈ ఇండెక్స్‌ భారీగా లాభపడిన తరువాత బుల్స్‌లో ఆశలు రేకిత్తించింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా