గూగుల్‌ మీటింగ్‌ ఆప్‌ డైరెక్టుగా జీమెయిల్‌తో

15 May, 2020 14:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: మీకు జీ-మెయిల్‌ అకౌంట్‌ ఉంటే ఇక మీరు వీడియో కాల్ మాట్లాడోచ్చు. అవును గూగుల్‌ ఇప్పడు గూగుల్‌ మీటింగ్‌ ఆప్‌ను జీ-మెయిల్‌కు డైరెక్టుగా అనుసంధానం చేసింది. ఇక భారతదేశంలోని జీమెయిల్‌ వినియోగదారులంతా తమ వారు ఎక్కడున్న వారితో వీడియో కాల్‌, కాన్ఫరెన్స్‌ కాల్స్‌, చాట్‌ చేయోచ్చు. ఈ రోజు నుంచి మీ జీ-మెయిల్‌  ఖాతాను తెరవగానే మీకు ఎడమ వైపు మీట్‌ పాప్‌ అప్‌ కనిపిస్తుంది. మీట్ సెస్సన్‌ కింద, “స్టార్ట్‌‌ మీటింగ్‌ లేదా జాయిన్‌ మీటింగ్‌” అనే రెండు ఆప్షన్స్‌ వస్తాయి. ఇది ఇక జీ-మెయిల్‌  ఖాతాదారులకు చాలా సులభంగా ఉంటుంది. ఏలాంటీ శ్రమ లేకుండా డైరెక్టుగా ఈ ఆప్‌ను మీ జీమెయిల్‌ నుంచి సులభం ఉపయోగించుకోవచ్చు.  (5జీ కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందే..)

ఇటీవల గూగుల్ ప్రీమియం మీట్ యాప్‌ను వినియోగదారులందరికీ ఉచితం చేసింది. ఇది నేరుగా మీ జీమెయిల్‌ కనెక్ట్‌ అవుతుందని ప్రకటించింది.  కాగా జూమ్‌, స్కైప్‌ వంటి వీడియో కాన్పరెన్స్‌ కాల్‌ ప్లాట్‌ఫాంలా జీమెయిల్‌ మీట్‌ ఆప్‌ను కూడా కనుగొన్నారు. ఇక ప్రస్తుత రోజుల్లో ప్రతిఒక్కరికీ జీమెయిల్‌ ఖాతా ఉన్నందున గూగుల్ మీట్ ఇతర వీడియో కాలింగ్ ప్లాట్‌ఫాంల కంటే చాలా సౌకర్యంగా ఉంటుంది. ఒకవేళ ఇప్పటికీ మీకు జీ మెయిల్‌ ఖాతా లేకపోతే మీ గూగుల్‌ అకౌంటుకు గూగుల్‌ మీట్‌ ఆప్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. (ఒకే వాట్సప్‌ ఖాతా మల్టీ డివైస్‌ కూడా!)

జీమెయిల్‌లో గూగుల్‌ మీట్‌ వీడియో కాల్‌ను ఏలా కనెక్ట్‌ చేయాలంటే..
మొదట మీరు మీ జీమెయిల్‌ను ఒపెన్‌ చేయగానే  డ్రాప్ట్‌ కింద గూగుల్‌ మీట్‌  సెక‌్షన్‌ ఉంటుంది. ఆ తర్వాత మీరు స్టార్ట్‌‌ ఏ మీటింగ్‌, జాయిన్‌ ఏ మీటింగ్‌’ అని రెండు అప్షన్స్‌ వస్తాయి.

  • ఒకవేళ మీరు స్టార్ట్‌ మీటింగ్‌ క్లిక్‌ చేస్తే.. గూగుల్‌ మీట్‌ మీమ్మల్ని ల్యాప్‌ట్యాప్‌ కెమారా లేదా మైక్రో ఫోన్స్‌ పర్‌మిషన్‌ యాక్స‌స్‌ ఇస్తుంది. 
  • కెమారా యాక్సన్‌ను ఒకే చేస్తే.. కెమరా క్షణాల్లో సెట్‌అప్‌ అవుతుంది. 
  • ఒక్కసారి అది ఒకే అవ్వగానే మీకు మీటింగ్‌ రెడీ అని మెసెజ్‌ వస్తుంది. 
  • గూగుల్‌ మీట్‌ మీమ్మల్ని.. మీరు కాల్‌లో చేరాలనుకుంటున్నారా లేదా ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నారా అని అడుగుతుంది. 
  • ఒకవేళ మీరు జాయిన్‌ క్లిక్‌ చేస్తే వీడియో చాట్‌ కోసం లింక్‌తో కూడిన న్యూ పాప్-అప్ విండో ఒపెన్‌ అవుతుంది. ఈ లింక్‌ను మీరు ఎవరితో మాట్లాలనుకుంటున్నారో వారికి కాపి లేదా సెండ్‌ చేయోచ్చు లేదా పాల్గొనే వారిని కాల్‌కు మాన్యువల్‌గా జోడించవచ్చు. 
  • హోస్ట్ మీకు పంపించిన మీటింగ్ ఐడిని నమోదు చేసి ఇర మీటింగ్‌లో జాయిన్‌ అవ్యోచ్చు. 
  • అంతేగాక గూగుల్‌‌ మీట్ ఆప్‌లో కొన్ని అడ్వాన్స్‌డ్‌ ఫీచర్స్‌ కూడా ఉన్నాయి. షెడ్యూలింగ్‌, షేరింగ్‌ స్క్రీన్‌ షాట్స్‌, రియల్‌ టైం క్యాప్షన్స్‌, అవసరానికి అనుగుణంగా మీరు ఎంచుకోగల లే అవుట్స్‌ వంటి ఫీచర్స్‌ ఉన్నాయి. 
మరిన్ని వార్తలు