మన ఐటీ రంగంపై పరిమితంగానే గ్రీసు సంక్షోభ ప్రభావం

2 Jul, 2015 00:04 IST|Sakshi
మన ఐటీ రంగంపై పరిమితంగానే గ్రీసు సంక్షోభ ప్రభావం

న్యూఢిల్లీ: గ్రీసు సంక్షోభ ప్రభావం భారత్‌లోని ఐటీ కంపెనీల ఆదాయాలపై 1-2 శాతంగా ఉంటుందని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ ‘బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్’ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) తెలిపింది. యూరో-రూపీ మారకపు రేట్ల ప్రభావం, యూరప్‌లోని ఇతర దేశాల అభివృద్ధి వంటి అంశాలు ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతాయని వివరించింది. భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు యూరప్‌తో సంబంధాలను కలిగి ఉన్నాయని, గ్రీసుతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేవని పేర్కొంది. భారత్‌కు చెందిన ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉత్తర యూరప్ దేశాలు, స్విట్జర్లాండ్ వంటి దేశాలతో సంబంధాలను కలిగి ఉన్నాయని తెలిపింది.

మరిన్ని వార్తలు