ఆన్‌లైన్లో ఆక్స్‌ఫర్డ్‌  తెలుగు డిక్షనరీ 

15 Nov, 2018 00:35 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీస్‌ ప్రపంచ భాషల కార్యక్రమంలోకి తెలుగు కూడా చేరింది. తెలుగు ఆన్‌లైన్‌ డిక్షనరీ  జ్టి్టpట://్ట్ఛ.్ఠౌజౌటఛీ ఛీజీఛ్టిజీౌn్చటజ్ఛీట. ఛిౌఝ అందుబాటులోకి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీస్‌ సంస్థ 2015 సెప్టెంబర్‌లో  ‘ఆక్స్‌ఫర్డ్‌ గ్లోబల్‌ లాంగ్వేజెస్‌’ ప్రాజెక్టును చేపట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 100 భాషలకు సంబంధించి లెక్సికో గ్రాఫికల్, ఇతర భాషా వనరులను ఆన్‌లైన్‌లో అందు బాటులోకి తేవటమే ఈ ప్రాజెక్టు ధ్యేయం. ‘‘ఆక్స్‌ఫర్డ్‌ ప్రపంచ భాషల్లోకి తాజాగా తెలుగు చేరడం పట్ల సంతోషంగా ఉన్నాం. తెలుగు భారత్‌లో నాలుగో అతిపెద్ద భాష’’ అని ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీస్‌ డైరెక్టర్‌ జూడీ పియర్సల్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు