పేటీఎం మాల్‌కు రూ.2,900 కోట్ల పెట్టుబడులు

3 Apr, 2018 00:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ షాపింగ్‌ వెంచర్, పేటీఎం మాల్‌ భారీగా పెట్టుబడులను సమీకరించింది. సాఫ్ట్‌బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ హోల్డింగ్స్, ఆలీబాబాడాట్‌కామ్‌ సింగపూర్‌ ఈ కామర్స్‌ సంస్థల నుంచి రూ.2,900 కోట్ల మేర పెట్టుబడులను పేటీఎం మాల్‌ సమీకరించింది. ఈ భారీ నిధులతో  ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లతో పోటీపడటానికి తగిన ఆర్థిక బలిమి పేటీఎంకు చేకూరుతుందని నిపుణులంటున్నారు.

ఈ పెట్టుబడుల కారణంగా పేటీఎం మాల్‌ విలువ 200 కోట్ల డాలర్లని విశ్లేషకులు అంచనా వేశారు. కాగా సాఫ్ట్‌బ్యాంక్, ఆలీబాబాల తాజా పెట్టుబడులతో తమ కంపెనీ వ్యాపార విధానం, వృద్ధి జోరు, నిర్వహణ తీరు పటిష్టంగా ఉన్నాయని మరోసారి వెల్లడైనట్లు పేటీఎం మాల్‌ సీఓఓ అమిత్‌ సిన్హా చెప్పారు. టెక్నాలజీ, లాజిస్టిక్స్, పీటీఎం మాల్‌ బ్రాండ్‌ను మరింత శక్తివంతం చేయడానికి.. ఈ నిధులను వినియోగిస్తామని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు