బిగ్‌ బాస్కెట్‌లో పేటీఎంకు మైనారిటీ వాటా?

13 Jul, 2017 01:01 IST|Sakshi
బిగ్‌ బాస్కెట్‌లో పేటీఎంకు మైనారిటీ వాటా?

రూ.1,300 కోట్ల పెట్టుబడులపై చర్చలు
న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ గ్రోసరీ (కిరాణా సరుకులు) రిటైలింగ్‌ సంస్థ బిగ్‌బాస్కెట్‌లో పేటీఎం మైనారిటీ వాటా తీసుకునే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ డీల్‌ విలువ 200 మిలియన్‌ డాలర్లు (రూ.1,300 కోట్లు) ఉండొచ్చని సమాచారం. చర్చలు మొదలయ్యాయని, వచ్చే కొన్ని వారాల్లో డీల్‌ ఖరారవుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి ఈ వ్యవహారం చర్చల దశలోనే ఉందని స్పష్టం చేశాయి.

బిగ్‌బాస్కెట్‌లో పెట్టుబడులతో ఈ కామర్స్‌లో పేటీఎం మరింత బలోపేతం అయ్యేందుకు సాయపడుతుందని పేర్కొన్నాయి. కాగా, ఇది పూర్తిగా నిజం కాదని బిగ్‌బాస్కెట్‌ స్పష్టం చేయగా, పేటీఎం స్పందించేందుకు నిరాకరించింది. అమెజాన్, బిగ్‌బాస్కెట్‌ మధ్య చర్చలు జరుగుతున్నాయని లోగడ వార్తలు వచ్చాయి. ఆన్‌లైన్‌ గ్రాసరీ విక్రయాలను పేటీఎం, అమెజాన్‌ ఇప్పటికే తమ ఈ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై ప్రారంభించాయి కూడా.

మరిన్ని వార్తలు