ఖతార్‌ ఫండ్‌కు అదానీ ఎలక్ట్రిసిటీలో వాటా

12 Dec, 2019 03:19 IST|Sakshi

డీల్‌ విలువ రూ.3,200 కోట్లు

న్యూఢిల్లీ: అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై లిమిటెడ్‌లో 25.1 శాతం వాటాను ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ(క్యూఐఏ) కొనుగోలు చేయనున్నది. ఈ డీల్‌ విలువ రూ.3,200 కోట్లు. ఈ మేరకు ఖతార్‌కు చెందిన సావరిన్‌ వెల్త్‌ ఫండ్, ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీతో నిశ్చయాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని అదానీ గ్రూప్‌లో భాగమైన అదానీ ట్రాన్సిమిషన్‌ తెలిపింది. అదానీ ట్రాన్సిమిషన్‌ కంపెనీకి చెందిన అదానీ ఎలక్ట్రిసిటీ ముంబై సంస్థ(ఏఈఎమ్‌ఎల్‌), ముంబైలో 400 చదరపు కిలోమీటర్ల పరిధిలో 30 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్తును పంపిణి చేస్తోంది. ఈ డీల్‌ నేపథ్యంలో అదానీ ట్రాన్సిమిషన్‌ షేర్‌ ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.350ను తాకింది. చివరకు 1.7 శాతం లాభంతో రూ.342 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు