స్టాక్‌మార్కెట్ల పతనంపై స్పందించిన జైట్లీ

8 Feb, 2018 19:07 IST|Sakshi
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: దీర్ఘకాల మూలధన లాభాలపై  బడ్జెట్‌లో ప్రతిపాదనల అనంతరం భారీ పతనాన్ని నమోదు చేసిన  షేర్‌మార్కెట్‌ వ్యవహరంపై   కేంద్ర  ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ  గురువారం స్పందించారు.   లోక్‌సభలో బడ్జెట్‌  ప్రతిపాదనలను  సమర్ధించుకున్న ఆయన ఎల్‌టీసీజీ టాక్స్‌ మూలంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు  కుప్పకూలలేదని  పేర్కొన్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు కుప్పలకూలయన్నారు. తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొందంటూ జపాన్‌ నిక్కీ, అమెరికా  డోజోన్‌ మార్కెట్ల క్రాష్‌ను జైట్లీ  ప్రస్తావించారు. గత ఏడాది దీర్ఘకాలిక పెట్టుబడుల లాభాలనుంచి మినహాయించిన ఆదాయం రూ. 3.67 లక్షల కోట్లుగా ఉందన్నారు.  ఈ సందర్భంగా కాంగ్రెస్‌  యూపీఏ హయాంలోని కాంగ్రెస్‌  ప్రభుత్వంపై  విమర్శలకు దిగారు.   2003- 2013 మధ్యకాలంలో  కాంగ్రెస​  ప్రభుత్వం చేపట్టిన  నిర్మాణపరమైన సంస్కరణలేవీ లేవని  జైట్లీ  ఎద్దేవా చేశారు.  అలాగే కాంగ్రెస్ పాలనలో ద్రవ్యోల్బణం 11 శాతంగా ఉంటే  తమ హయాంలో  4శాతం  కంటే తక్కువగా  ఉందన్నారు.

మరిన్ని వార్తలు