ఆర్‌ఐఎల్‌ ఫలితాలకు మహమ్మారి సెగ

30 Apr, 2020 19:40 IST|Sakshi

ముడి చమురు ధరల పతనం ఎఫెక్ట్‌

సాక్షి, న్యూఢిల్లీ : మార్చి త్రైమాసంలో కార్పొరేట్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) నికర లాభం 39 శాతం తగ్గి రూ 6,348 కోట్లుగా నమోదైంది. కోవిడ్‌-19 వ్యాప్తితో ముడిచమురు ధరల భారీ పతనం ప్రభావం ఆర్‌ఐఎల్‌ ఫలితాలపై చూపింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీ రూ 10,362 కోట్ల నికర లాభం ఆర్జించింది.

గత ఏడాది ఇదే క్వార్టర్‌లో రిలయన్స్‌ గ్రూప్‌ రాబడి రూ 1,42,565 కోట్లు కాగా ప్రస్తుతం 2.3 శాతం తగ్గి రూ 1,39,283 కోట్లకు పరిమితమైంది. ఇక దేశంలోనే అతిపెద్ద రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ 53,125 కోట్ల నిధులు సమీకరించేందుకు ఆర్‌ఐఎల్‌ ఆమోదముద్ర వేసింది. కాగా ఈ క్వార్టర్‌లో చమురు ధరలు అనూహ్యంగా తగ్గడంతో ఇంధన వ్యాపారంలో రూ 4245 కోట్ల నష్టం వాటిల్లిందని కంపెనీ పేర్కొంది.

చదవండి : ట్రెండ్ సెట్ చేసిన అంబానీ

మరిన్ని వార్తలు