16 శాతం పెరిగిన రిలయన్స్‌ పవర్‌ లాభం

20 Apr, 2018 00:06 IST|Sakshi

న్యూఢిల్లీ: రిలయన్స్‌ పవర్‌ గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.250 కోట్ల నికర లాభం సాధించింది. అంతక్రితం ఏడాది ఇదే క్వార్టర్‌లో రూ.216 కోట్ల  లాభం వచ్చిందని, 16% వృద్ధి చెందినట్లు కంపెనీ తెలిపింది. అధిక విద్యుదుత్పత్తి కారణంగాలాభం పెరిగిందని వివరించింది. అయితే ఆదాయం రూ.2,597 కోట్ల నుంచి రూ.2,401 కోట్లకు తగ్గిందని తెలిపింది.

అంతకు ముందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1,104 కోట్లుగా ఉన్న నికరలాభం గతేడాది రూ.1,035 కోట్లకు తగ్గిందని వివరించింది. బంగ్లాదేశ్‌లో నిర్మించనున్న ఎల్‌ఎన్‌జీ టెర్మినల్‌కు, 750 మెగావాట్ల గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్లాంట్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంక్‌(ఏడీబీ) 58.3 కోట్ల డాలర్ల రుణం ఇవ్వడానికి ఆమోదం తెలిపిందని పేర్కొంది.  

మరిన్ని వార్తలు