జియో ఫోన్‌ ఎఫెక్ట్‌: మీడియా, టెలికాం షేర్ల పతనం

22 Jul, 2017 09:27 IST|Sakshi
జియో ఫోన్‌ ఎఫెక్ట్‌: మీడియా, టెలికాం షేర్ల పతనం

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  40వ  ఏజీఎం సందర్భంగా  జియో ఫోన్‌  ప్రకటన తో మీడియా షేర్లు,  టెలికాం షేర్లు  భారీ పతనాన్ని నమోదు చేశాయి.   ఐడియా సెల్యులార్‌ ఏకంగా 6 శాతం, భారతి ఎయిర్‌ టెల్‌,  3.2,   ఆర్‌కాం1.43 శాతం, డిష్‌ టీవీ, 6శాతం, హాత్వే  కేబుల్‌ 2 శాతం పతనాన్ని నమోదు చేశాయి.  మరోవైపు  ఆర్‌ఐఎల్‌ 3 శాతం లాభాలతో కొనసాగుతోంది.

రిలయన్స్‌ జియో  ఎంట్రీతో దేశీయ  టెలికాం కంపెనీలు కుదేలయ్యాయి. ఉచిత ఆఫర్లనుంచి తారిఫ్‌లను మార్చుకుంటూ వచ్చినా  దేశీయ  పత్యర్థి టెల్కోల నష్టాలు  కొనసాగుతున్నాయి. దీనిపై  మూడు ప్రధాన  ఆపరేటర్ల ఆందోళన ఆరోపణలు కొనసాగుతుండగానే తాజా  ప్రపంచంలోనే అతి చవకైన 4జీ ఫీచర్‌ ఫోన్‌  ప్రకటించడం  వీటికి  మరింత  భారం కానుంది.

ముఖ్యంగా జియో కస్టమర్లకు ఈ ఫోన్‌ పూర్తిగా ఉచితం. వాయిస్‌ కాల్స్‌ ఉచితం.  దీంతో పాటు కేవలం రూ.153 లకే అన్ని సేవలను ఉచితంగా అందించనున్నట్టు  రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ ప్రకటించారు. దీంతో  శుక్రవారం నాటి మార్కెట్లో మీడియా షేర్లు,  టెలికాం షేర్లు  కుదేలయ్యాయి. అటు ఎనలిస్టులు కూడా   ఫోన్‌  మార్కెట్లోకి  జియో  ప్రవేశించడం  టెలికం దిగ్గజాలపై భారీగా ప్రభావితం చేయనుందని  వ్యాఖ్యానించారు.
 
 

మరిన్ని వార్తలు