ఏడాది కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం

12 Dec, 2018 18:52 IST|Sakshi

రిటైల్ ద్రవ్యోల్బణం 2.33 శాతం

పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్ నెలలో 8.1 శాతం

ఏడాది గరిష్టానికి ఫ్యాక్టరీ ఔట్‌పుట్‌

సాక్షి,ముంబై: నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది కనిష్టానికి దిగి వచ్చింది. బుధవారం వెల్లడించిన అధికారిక గణాంకాల  ప్రకారం  రిటైల్ ద్రవ్యోల్బణం 2.33 శాతంగా నమోదైంది. అక్టోబర్ నెలలో ఇది 3.31 శాతంగా ఉంది. వరుసగా గత నాలుగు నెలలుగా దిగి వస్తున్న రీటైల్‌ ద్రవ్యోల్బణం తాజాగా దీంతో 2017 జులై నాటి స్థాయిని నమోదు చేసింది. మరోవైపు పారిశ్రామికవృద్ధి  రేటు రెండింతలైంది. ఇది ఆర్థికవ్యవస్థకు డబుల్‌ బొనాంజా అని  విశ్లేషకులు పేర్కొన్నారు.

పారిశ్రామిక వృద్ధి రేటు అక్టోబర్ నెలలో 8.1 శాతం పెరిగింది.ఇది ఏడాది గరిష్టం. సిఎస్ఓ డేటా ప్రకారం  కన్స్యూమర్ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ 2.61 శాతంతో పోలిస్తే.. తాజాగా 0.86 శాతంగా ఉంది.  గత నెలలో 7.39 శాతంతో పోలిస్తే ఇంధనం ద్రవ్యోల్బణం 8.55 శాతంగా నమోదైంది. దుస్తులు, పాదరక్షల ద్రవ్యోల్బణం అక్టోబరు 3.55 శాతంతో పోలిస్తే 3.53 శాతం వద్ద ఉంది.  హౌసింగ్‌   ద్రవ్యోల్బణం  నవంబరు 5.99గా నమోదుకాగా అంతకుముందు నెలలో  ఇది  6.55 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు