తొలి రోజు  రూపాయికి బలం

2 Jan, 2019 01:29 IST|Sakshi

 ముంబై: కొత్త సంవత్సరం తొలి రోజున రూపాయి తన బలాన్ని చూపించింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో పోలిస్తే 34 పైసలు లాభపడి 69.43 వద్ద క్లోజయింది. అంతకుముందు రెండు రోజుల్లో రూపాయి లాభపడిన విషయం తెలిసిందే. మొత్తంమీద మూడు రోజుల్లో రూపాయి 92 పైసలు రికవరీ అయింది. ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, స్టాక్‌ మార్కెట్ల ర్యాలీ కలిసొచ్చాయి. ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్లను విక్రయించడం రూపాయి బలపడటానికి కారణమని ట్రేడర్లు తెలిపారు. ఫారెక్స్‌ మార్కెట్లో మంగళవారం తొలుత 69.63 వద్ద ప్రారంభమైన రూపాయి ఆ తర్వాత మరింత బలపడింది. గత సంవత్సరం చివరి రోజు రూపాయి 18 పైసల లాభంతో ముగింపు పలికిన విషయం గమనార్హం. గత సంవత్సరంలో మొత్తం మీద రూపాయి 9.23 శాతం విలువను కోల్పోయింది. 2017 చివరికి రూపాయి డాలర్‌తో 63.87వద్ద ఉండటం గమనార్హం.  అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. క్రూడ్‌ ధరలు అనూహ్యంగా 30 డాలర్ల వరకూ పడిపోతూ వచ్చిన నేపథ్యంలో... క్రమంగా కోలుకుంటూ వస్తోంది.  

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

పీఎస్‌బీలకు తగ్గనున్న మూలధన నిధుల సాయం! 

శామ్‌సంగ్‌.. ఫోల్డ్‌ చేసే ఫోను ధర రూ.1.4 లక్షలు  

వడ్డీ భారం ఎందుకు తగ్గించట్లేదు? 

తెలుగు రాష్ట్రాల్లో ‘సిమెంటు’ జోరు

ఇక్కడ మాత్రమే 7 శాతం వృద్ధి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మహేష్‌.. శభాష్‌! 

సరికొత్త సిరివెన్నెల 

నయా సినిమా.. నయా లుక్‌

డబుల్‌ ధమాకా!

మరో సౌత్‌ రీమేక్‌

నిర్మాత రాజ్‌కుమార్‌ బర్జాత్య మృతి