భారతీయుల సంపదపై రూపాయి దెబ్బ

12 Dec, 2016 14:55 IST|Sakshi
భారతీయుల సంపదపై రూపాయి దెబ్బ

2016లో 26 బిలియన్ డాలర్ల తగ్గుదల
96 శాతం మందిలో సంపదలేమి
24 లక్షల మంది వద్దే లక్ష డాలర్లు అంతకంటే ఎక్కువ
ఐదేళ్లలో స్విట్జర్లాండ్, తైవాన్‌ల కంటే ముందుకు
క్రెడిట్ సూసీ నివేదికలో వెల్లడి

ముంబై: డాలరు-రూపారుు కరెన్సీ కదలికల్లో వచ్చిన మార్పుల ఫలితంగా భారతీయుల కుటుంబ సంపద గతేడాదితో పోలిస్తే 2016లో 26 బిలియన్ డాలర్ల (0.8%) మేర తగ్గి మూడు లక్షల కోట్ల అమెరికన్ డాలర్లు (రూ.204 లక్షల కోట్ల రూపాయలు)గా ఉన్నట్టు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సేవల కంపెనీ క్రెడిట్ సూసీ పేర్కొంది. ఈ మేరకు క్రెడిట్ సూసీ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్‌ను రూపొందించింది. భారత్‌లో సంపద పెరుగుతున్నప్పటికీ ఇది అందరికీ అందడం లేదని స్పష్టం చేసింది. భారత్‌లో సంపద లేమి ఇప్పటికీ గణనీయంగానే ఉందని, 96 శాతం వయోజనుల సంపద 10 వేల డాలర్లు (రూ.6.8 లక్షలు) లోపే ఉందని తెలిపింది. కేవలం 0.3% ప్రజల వద్దే లక్ష డాలర్లు (రూ.68 లక్షలు) కంటే ఎక్కువ సంపద ఉన్నట్టు నివేదిక వెల్లడించింది. వీరి సంఖ్య 24 లక్షలని తెలిపింది. ముఖ్యాంశాలివీ...

 ప్రపంచ ఐశ్వర్యవంతుల్లో...
ప్రపంచంలోని  ఒక శాతం టాప్ ఐశ్వర్య వంతుల్లో భారత్ నుంచి 2,48,000 మంది ఉన్నారు. 5 కోట్ల డాలర్లకు (రూ.340 కోట్లు) మించి సంపద కలిగిన భారతీయుల సంఖ్య 2,260 మంది. అదే సమయంలో 1,040 మంది వద్ద పది కోట్ల డాలర్లకు (రూ.680 కోట్లు) మించి సంపద ఉంది.

కరెన్సీ మారకం విలువల్లో తేడాల ఫలితంగా చైనీయుల కుటుంబ సంపద 2.8 శాతం, భారతీయుల కుటుంబ సంపద 0.8 శాతం తగ్గింది. అరుుతే, మొత్తం మీద ఆసియా పసిఫిక్ ప్రాంతంలో సంపద వృద్ధి 4.5%గా ఉంది.

ఇక ప్రపంచవ్యాప్తంగా సంపద 1.4% పెరుగుదలతో 256 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. సగటున ఓ వ్యక్తి (వయోజనులు) వద్ద ఉన్న సంపదలో ఎటువంటి మార్పు లేకుండా 52,800 డాలర్లు (రూ.35 లక్షలు)గానే ఉంది.

ప్రపంచ సంపదలో అభివృద్ధి చెందుతున్న దేశాల వాటా 2000 సంవత్సరంలో 12 శాతంగా ఉంటే అది తాజాగా 18 శాతానికి చేరింది.

అమెరికా ఇకముందూ ప్రపంచ సంపద వృద్ధికి చోదకంగా ఉంటుందని, 2021 నాటికి 112 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుటుంది.

సంపదలో భారత్ ఐదేళ్లలో స్విట్జర్లాండ్, తైవాన్‌లను మించుతుంది.

మరిన్ని వార్తలు