ఎన్‌ఎస్‌ఈలో ఒక శాతం వాటా విక్రయం: ఎస్‌బీఐ

4 Jan, 2020 02:07 IST|Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లో 1.01 శాతం వాటాను ఎస్‌బీఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా)విక్రయించనున్నది. మూలధన నిధుల సమీకరణలో భాగంగా 1.01 శాతం వాటాకు సమానమైన 50 లక్షల షేర్లను విక్రయించనున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది. కాంపిటేటివ్‌ బిడ్డింగ్‌ ప్రక్రియ ద్వారా ఈ షేర్లను విక్రయిస్తామని తెలిపింది. నిర్దేశిత ఫార్మాట్‌లో కనీసం పది లక్షల షేర్లకు బిడ్‌ చేయాల్సి ఉంటుందని, ఆసక్తి గల సంస్థలు ఈ నెల 15 వ తేదీలోగా దరఖాస్తు  చేయాలని పేర్కొంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఎస్‌బీఐకు 5.19 % వాటా ఉంది. 2016లో ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం వాటాను మారిషస్‌కు చెందిన వెరాసిటి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు రూ.911 కోట్లకు ఎస్‌బీఐ విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈలో వాటా విక్రయంతో పాటు మరో రెండు కంపెనీల్లో కూడా వాటా విక్రయం ద్వారా నిధులు సమీకరించాలని ఎస్‌బీఐ యోచిస్తోంది.

మరిన్ని వార్తలు