వారాంతంలో వీక్‌నెస్‌

8 Mar, 2019 14:43 IST|Sakshi

బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు   అక్కడక్కడేకదులుతున్నాయి. ఒకదశంలో 100 పాయింట్లకు  పైగా నష్టపోవడంతో , నిఫ్టీ 11వేల స్తాయిని కోల్పోయింది. అయతే  ఆ తర్వాత పుంజుకుని ప్రస్తుతం సెన్సెక్స్‌55 పాయింట్లు క్షీణించి 36,669 వద్ద, నిఫ్టీ  27 పాయింట్లు క్షీణించి 11,031 వద్ద ట్రేడవుతోంది. శుక్రవారం  వారాంతంలో స్ట్రాంగ్‌ ముగిస్తే సానుకూల సంకేతమని ఎనలిస్టులు చెబుతున్నారు. 

యూరోజోన్‌ ఆర్థిక వృద్ధి అంచనాలను కేంద్ర బ్యాంకు ఈసీబీ భారీగా తగ్గించడంతో ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు నష్టపోయాయి. ప్రపంచ జీడీపీ పురోగతిపై తాజాగా సందేహాలు తలెత్తడంతో గురువారం యూరోపియన్‌, అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది.  ప్రధానంగా చైనా, జపాన్‌, హాంకాంగ్‌, కొరియా  బలహీన ధోరణిలోనే ఉన్నాయి. 

మెటల్‌,  ఐటీ రంగాలు నష్టపోతున్నాయి.  ఎన్‌టీపీసీ, ఐషర్‌, బజాజ్‌ ఆటో, టైటన్‌, ఐటీసీ, టీసీఎస్‌, సన్‌ ఫార్మా, ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఇన్ఫ్రాటెల్‌ లాభపడుతుండగా,  విప్రో, ఐవోసీ, హిందాల్కో, టాటా మోటార్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌  నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు