నష్టాల్లో మార్కెట్లు, మెటల్‌, ఆటో  వీక్‌

29 Jul, 2019 14:11 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాలతో కొనసాగుతున్నాయి. వరుస ఆరు రోజుల వరుస నష్టాలకు  శుక్రవారం చెక్‌ చెప్పినా, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో  నేడు భారీగా నష్టపోతున్నాయి. 360 పాయింట్లకు పోయిగా నష్టపోయిన సెన్సెక్స్‌ ప్రస్తుతం 200 పాయింట్లకు పైగా కోలుకుని  177 పాయింట్లు పతనమై 37,709 వద్ద,  నిఫ్టీ 80 పాయింట్ల వెనకడుగుతో 11,203 వద్ద ట్రేడవుతోంది. ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష, అమెరికా- చైనా మధ్య వాణిజ్య చర్చలపై సందేహాల నేపథ్యంలో  ఆసియా మార్కెట్లు బలహీనంగా ఉన్నాయి.

ఐటీ తప్ప అన్ని రంగాలూ  నష్టపోతున్నాయి.  ఆటో రంగం 3 శాతం పతనంకాగా.. మెటల్‌, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆటో కౌంటర్లలో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, అశోక్‌ లేలాండ్‌, టీవీఎస్‌, అపోలో టైర్‌, మదర్‌సన్‌, ఐషర్‌, హీరో మోటో, మారుతీ, ఎంఅండ్‌ఎం, భారత్ ఫోర్జ్‌,  మెటల్‌ కౌంటర్లలో వేదాంతా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హింద్‌ జింక్‌, ఎంవోఐఎల్‌, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, టాటా స్టీల్‌ నష్టపోతున్నాయి.  ఫార్మా కౌంటర్లలో పిరమల్‌, బయోకాన్‌, కేడిలా, అరబిందో, సన్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, సిప్లా, లుపిన్ కౌంటర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బ్యాంక్‌ స్టాక్స్‌లో బీవోబీ, బీవోఐ, సెంట్రల్‌, యూనియన్‌, ఎస్‌బీఐ, సిండికేట్‌, అలహాబాద్‌, కెనరా, ఇండియన్‌ బ్యాంక్‌ 3-1 శాతం మధ్య, ఇండియాబుల్స్‌, మహీంద్రా లైఫ్‌, సన్‌టెక్‌, ప్రెస్టేజ్‌, డీఎల్‌ఎఫ్‌, ఫీనిక్స్‌  భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి.
 
ఐసీఐసీఐ బ్యాంక్‌,  హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, కొటక్‌ బ్యాంక్‌, మారికో, మైండ్‌ట్రీ, బెర్జర్‌ పెయింట్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, అమరరాజా, పేజ్‌ ఇండస్ట్రీస్ లాభపడుతున్నాయి.

మరిన్ని వార్తలు