నష్టాల్లో స్టాక్‌మార్కెట్‌ 

14 Nov, 2019 10:05 IST|Sakshi

సాక్షి,ముంబై : దేశీ స్టాక్‌ మార్కెట్లు ఒడిదొడుకులతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ  ప్రతికూల సంకేతాలతో  ప్రస్తుతం సెన్సెక్స్‌ 62 పాయింట్ల బలహీనంగా 40,052వద్ద నిఫ్టీ 33 పాయింట్ల క్షీణతతో 11,806 వద్ద ట్రేడవుతోంది. మూడీస్‌ షాక్‌నుంచి ఇంకా తేరుకోని మార్కెట్లకు  ఐఐపీ డేటా,  ఇన్‌ఫ్లేషన్‌ డేటాలు మరింత  షాకిచ్చాయి.  దీనికి  టెలికం రంగ సంక్షోభం తోడయ్యింది.  దీంతో  ఒక్క మీడియా తప్ప దాదాపు అన్ని రంగాలు బలహీనంగా ఉన్నాయి. ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ  నష్టపోతుండగా, ఐటీ, మీడియా స్వల్పంగా లాభపతుండగా,  భారతి ఇన్‌ఫ్రాటెల్‌, భారతి ఎయిర్టెల్‌; ఇండస్‌ఇండ్‌  టాటా మోటార్స్‌ ,  బ్రిటానియా, హిందాల్కో ఐడియా నష్టపోతున్నాయి. ఇన్ఫోసిస్‌, టైటన్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐషర్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, మారుతీ లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు