ఆర్‌బీఐ బూస్ట్‌: 7వ రోజూ ర్యాలీ

19 Dec, 2018 16:08 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి చివరి దాకా పటిష్టంగా కొనసాగినకీలక సూచీలు వరుసగా ఏడవ రోజు కూడా లాభాల్లోనే స్థిరంగా  క్లోజ్‌ అయ్యాయి. ముఖ్యంగా ముడి చమురు ధరలు  గణనీయంగా క్షీణించడంతోపాటు, ఆర్‌బీఐ  బ్లాండ్ల ప్రకటన దేశీయ స్టాక్ మార్కెట్లకు ఊతమిచ్చాయి.  వచ్చే నెల 50వేల కోట్ల రూపాయల ఓపెన్‌ మార్కెట్ల బాండ్ల కొనుగోలుచేయనున్నామని ఆర్‌బీఐ ప్రకటించింది. దీంతో దలాల్‌ స్ట్రీట్‌లో కొనుగోళ్ల జోరు కొనసాగిందిసెన్సెక్స్‌ 137 పాయింట్లు ఎగిసి 36,484 వద్ద, నిఫ్టీ  59 పాయింట్లు పుంజుకుని 10,967 వద్ద  స్థిరపడింది. 

పీఎస్‌యూ బ్యాంకు,  రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ , ఆటో   షేర్లు భారీగా లాభపడ్డాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్‌, ఇందస్‌ ఇండ్‌, టీసీఎస్‌ టాప్‌ లూజర్స్‌గా  నిలిచాయి.  ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, బజాజ్ ఫిన్‌ సర్వ్‌ , యాక్సిస్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌ మారుతి, ఐటీసీ, విప్రో, ఆషియన్‌ పెయింట్స్‌ టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి.


  

మరిన్ని వార్తలు