సరికొత్త రికార్డుల్లో స్టాక్ మార్కెట్లు

16 May, 2017 12:12 IST|Sakshi
సరికొత్త రికార్డుల్లో స్టాక్ మార్కెట్లు
స్టాక్ మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డు స్థాయిలను తాకుతున్నాయి. మంగళవారం ప్రారంభ ట్రేడింగ్ లో సెన్సెక్స్ 197 పాయింట్లకు పైగా పైకి జంప్ చేసి సెన్సెక్స్, ప్రస్తుతం 122 పాయింట్ల లాభంలో 30,444 వద్ద లాభాల్లో నడుస్తోంది. అదేవిధంగా నిఫ్టీ సైతం 25.60 పాయింట్ల లాభంలో 9,471 వద్ద ట్రేడవుతోంది. ఒకానొక దశలో నిఫ్టీ కొత్త రికార్డు 9493 వద్ద పీక్ స్థాయికి వెళ్లింది. నిఫ్టీ 9500 ను బీట్ చేసే అవకాశాలున్నాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్లు సరికొత్త రికార్డులో సంచలనాలు సృష్టిస్తుడటంతో దలాల్ స్ట్రీట్ లో పండుగ వాతావరణం నెలకొంది. ఫారిన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు తిరిగి భారత మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభించడంతో దలాల్ స్ట్రీట్ లో సెంటిమెంట్ బలపడిందని విశ్లేషకులు చెప్పారు. టెక్నాలజీ, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లాభాలు కురిపిస్తుండగా.. బ్యాంకు, ఇన్ ఫ్రా స్టాక్స్ నష్టాలు పాలవుతున్నాయి.  
 
అమెరికా ఆర్థిక డేటా బలహీనంగా రావడంతో డాలర్ నష్టాలు పాలవుతోంది. డాలర్ నష్టాలు, గోల్డ్ ధరకు బాగా సహకరిస్తోంది. వరుసగా నాలుగో రోజులు గోల్డ్ ధరలు పైకి ఎగుస్తూ 28,080 రూపాయల పైన ట్రేడవుతున్నాయి. అమెరికా బిజినెస్ ల్లో రికవరీ ఆశలు పొందుతుండటంతో దేశీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 2 శాతం పైగా ర్యాలీ జరుపుతోంది. మార్నింగ్ ట్రేడింగ్ లో లార్జ్ క్యాప్ లో భారతీ ఎయిర్ టెల్ అతిపెద్ద గెయినర్ గా 3 శాతానికి పైగా లాభాలు పండించింది. ఎయిర్ టెల్ తర్వాత టాటా స్టీల్, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఐఓసీ, ఏసీసీ, ఐసీఐసీఐ బ్యాంకు లాభాల్లో నడిచాయి. ఏసియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, బీహెచ్ఈఎల్, హెచ్డీఎఫ్సీ, అదానీ పోర్ట్స్, కొటక్ మహింద్రా బ్యాంకు, సిప్లా, బ్యాంకు ఆఫ్ బరోడాలు ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలు గడించాయి. 
 
>
మరిన్ని వార్తలు