దక్షిణాఫ్రికా పర్యాటక రంగంలో వ్యాపార అవకాశాలు!

23 Feb, 2016 04:18 IST|Sakshi

18 బిలియన్ డాలర్లకు
భారత-దక్షిణాఫ్రికా ద్వైపాక్షిక వాణిజ్యం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణాఫ్రికాలో పర్యాటక రంగంలో వ్యాపార, పెట్టుబడి అవకాశాలపై విస్తృత స్థాయిలో ప్రచారం, అవగాహన చేయాల్సిన అవసరం ఉందని దక్షిణాఫ్రికా హై కమిషనర్ ఫ్రాన్స్ కె మోర్లే అభిప్రాయపడ్డారు. ఎందుకంటే తమ దేశంలో వ్యాపారమంటే కేవలం రసాయన, మైనింగ్ రంగాలనే భావన ఉందని కానీ, వాస్తవానికి వ్యవసాయంతో పాటుగా పర్యాటక రంగంలోనూ పుష్కలమైన వ్యాపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. .2013లో ఇరు దేశాల వాణిజ్యం విలువ 12 బిలియన్ డాలర్లుగా ఉంటే 2015 నాటికది పురోగతి బాటలో  15 బిలియన్ డాలర్లుకు పెరిగిందని పేర్కొన్నారు. 2018 నాటికి 18 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారమిక్కడ రెండు రోజుల దక్షిణాఫ్రికా వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ 7వ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దక్షిణాఫ్రికా దేశానికి చెందిన సుమారు 23 కంపెనీలు, 60కి పైగా భారత కంపెనీలు పాల్గొన్నాయన్నాయని తెలిపారు.

మరిన్ని వార్తలు