స్పైస్ జెట్ లాభం 103 శాతం అప్...

12 Dec, 2016 15:13 IST|Sakshi
స్పైస్ జెట్ లాభం 103 శాతం అప్...

వరుసగా ఏడో క్వార్టర్‌లోనూ లాభాలు

 ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.59 కోట్ల నికర లాభం ఆర్జించింది.  గత క్వార్టర్ లాభం రూ.29 కోట్లతో పోల్చితే 103 శాతం వృద్ధి సాధించామని కంపెనీ తెలిపింది.  వరుసగా. ఏడో క్వార్టర్‌లోనూ లాభాలార్జించామని కంపెనీ సీఎండీ అజయ్ సింగ్ చెప్పారు. ఒక క్వార్టర్‌లో ఇదే అత్యధిక లాభం అని కూడా తెలిపారు. నిర్వహణ మార్జిన్లు 24 శాతం పెరగడం, వ్యయాలు 10 శాతం తగ్గడం వల్ల ఈ స్థారుు లాభాలు వచ్చాయని వివరించారు. సాధారణంగా ఏడాదిలో ఈ క్వార్టరే బలహీనమని, తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ, మంచి పనితీరు కనబరిచామన్నారు. ఆదాయం 35% వృద్ధితో రూ.1400 కోట్లకు పెరిగిందని తెలిపారు. 92.3 శాతం ప్యాసింజర్ లోడ్  ఫ్యాక్టర్‌ను సాధించామని, పరిశ్రమలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు