స్టాక్‌ మార్కెట్‌కు ప్యాకేజ్‌ షాక్‌

22 Aug, 2019 18:04 IST|Sakshi

ముంబై : ఆర్ధిక ఉద్దీపన ప్యాకేజ్‌పై ప్రభుత్వం నుంచి స్పష్టత కొరవడటంతో స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీగా పతనమయ్యాయి. మదుపుదారులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో రియల్టీ, మెటల్‌, ఆటో, పీఎస్‌యూ షేర్లు భారీగా నష్టపోయాయి. మార్కెట్‌లోకి మళ్లే విదేశీ పెట్టుబడులపై బడ్జెట్‌లో పొందుపరిచిన పన్ను ప్రతిపాదనలపైనా కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడం, ఆర్థిక వ్యవస్థలో ఉత్తేజం నింపే ఉద్దీపన ప్యాకేజ్‌పై సైతం ఎలాంటి కదలికా లేకపోవడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మొత్తంమీద 587 పాయింట్లు నష్టపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36,472 పాయింట్ల వద్ద ముగియగా 177 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 10,741 పాయింట్ల వద్ద క్లోజయింది. ఇక యస్‌ బ్యాంక్‌, వేదాంత, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ తదితర షేర్లు నష్టపోగా, టీసీఎస్‌, హెసీఎల్‌ టెక్‌ షేర్లు లాభపడ్డాయి.

మరిన్ని వార్తలు