నిరాశపర్చిన నిఫ్టీ , 10వేల దిగువనే

26 Jul, 2017 09:29 IST|Sakshi

ముంబై: దేశీయ ‍ స్టాక్‌ మార్కెట్లు  స్వల్ప లాభాల్లో మొదలయ్యాయి.  ప్రీ మార్కెట్‌  సెషన్‌లో 10వేల మార్క్‌ను దాటిన నిఫ్టీ,  ఓపెనింగ్‌లో బుధవారం కూడా నిరాశపర్చింది.   స్వల్ప లాభాల్లో మొదలైన మార్కెట్లలో ప్రాఫిట్‌ బుకింగ్‌తో ఫ్లాట్‌గా  మారాయి.  ప్రస్తుతం సెన్సెక్స్18 పాయింట్ల లాభంతో 32246వద్ద,  ఐదెంకల నంబర్‌ను అందుకోవడంలో విఫలమైన నిఫ్టీ   10 పాయింట్ల లాభంతో  9974 వద్ద ‍  ట్రేడ్‌ అవుతోంది.  టైర్‌ షేర్లు భారీలా భాలనునమోదు  చేస్తున్నాయి.  బ్యాంక్‌ నిష్టీ, మెటల్‌, మిడ్‌ క్యాప్‌లాభాల్లో ఉన్నాయి.  పీడీ లైట్‌, భారతి ఎయిర్‌ టెల్‌, యాక్సిస్‌, ఏషియన్‌  పెయింట్స్‌, హీరో మోటార్‌ కార్ప్‌ నష్టపోతుండగా,  కోటక్‌ బ్యాంక్‌,  జేపీ అసోసియేట, రేమండ్‌ సుజ్లాన్‌,  ఇండియా బుల్స్ వెంచర్స్‌  తదితర షేర్లు లాభపడుతున్నాయి.
అటు డాలర్‌ మారకంలో రుపీ 0.04 పైసల నష్టంతో రూ. 64.38వద్ద ఉంది. ఎంసీఎక్స్‌ మార్కెట్‌ లో బంగారం ధరలు  వీక్‌గా ఉన్నాయి.  రూ.40  క్షీణించి పది  గ్రా. రూ.28, 746 వద్ద ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు