ఫార్మా, బ్యాంకుల అండతో లాభాల్లో మార్కెట్

23 Apr, 2020 09:51 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ  స్టాక్ మార్కెట్లు  ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. వెంటనే పుంజుకుని లాభాల్లోకి మళ్లాయి.  ప్రీ ఓపెనింగ్ లాభాల్లో  ఉన్నా, అకస్మాత్తుగా ఆరంభంలో  మిశ్రమంగా  మారి ఆశ్చర్యపర్చింది. ముడి చమురు ధరలు పుంజుకోవడం,  అంతర్జాతీయ  మార్కెట్ల సానుకూల సంకేతాలతో  ఒక దశలో 266 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం  సెన్సెక్స్ 144 పాయింట్లు ఎగిసి 31520 వద్ద, నిఫ్టీ  56 పాయింట్లు ఎగిసి 9239 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్నిరంగాలు, ప్రధానంగాఫార్మా ఇండెక్స్  లాభపడుతోంది.  జీ, బ్రిటానియా,  ఓఎన్ జీసీ,  భారతి ఇన్ ఫ్రాటెల్,యూపీఎల్, టాటా స్టీల్, కోటక్ మహీంద్ర, వేదాంతా, టీసీఎస్, గెయిల్, హిందాల్కో ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ బ్యాంకు లాభపడుతున్నాయి.  టైటన్, ఎం అండ్ ఎండ్,  మారుతిసుజుకి, శ్రీ సిమెంట్స్, హిందుస్తాన్ యునిలివర్, టెక్ మహీంద్ర, ఎన్టీపీసీ, భారతి ఎయిర్టెల్ అదానీ పో ర్ట్స్, హెచ్డీఎఫ్ సీ నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు