టాటా పవర్

3 Mar, 2014 02:15 IST|Sakshi

ఎందుకంటే: ప్రైవేట్ రంగ దిగ్గజ విద్యుత్ కంపెనీల్లో ఒకటైన ఈ కంపెనీ షేర్ రూ.142 స్థాయిల నుంచి రూ.80కు పడిపోయింది.  పలు అనుకూలమైన అంశాలు సమీప భవిష్యత్తులో ఈ కంపెనీ షేర్ పెరుగుదలకు దోహద పడనున్నాయి. ఇండోనేసియా బొగ్గు గనుల్లో 30% వాటా విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించడం దీంట్లో మొదటిది. ఈ వాటా విక్రయం కారణంగా కంపెనీకి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దీంతో కంపెనీ రుణ భారం గణనీయంగా తగ్గనున్నది. ఏడాదికి వడ్డీ భారం రూ.300 కోట్లు తగ్గుతాయి.

 రైట్స్ ఇష్యూ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని గత వారంలో కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. ఇది రెండోది. ఈ నిధుల కారణంగా కూడా రుణ భారం తగ్గనున్నది. ముంద్రా ప్రాజెక్ట్ విషయంలో  సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(సెర్క్) ఇచ్చిన ఉత్తర్వులు ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించడం మూడవది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్థిక ఫలి తాలు అంచనాలను మించనున్నాయి. ప్రస్తుతం 9,000 మెగావాట్లుగా ఉన్న కంపెనీ కెపాసిటీ ఐదేళ్లలో 25 వేల మెగావాట్లకు పెరగనున్నది. వీటన్నింటి దృష్ట్యా ప్రస్తుత ధర వద్ద కొనుగోళ్లకు ఈ షేర్ ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. ఏడాది కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం.

>
మరిన్ని వార్తలు