రియల్టీ కంపెనీలపై జీఎస్‌టీ భారం..

7 Jul, 2017 01:10 IST|Sakshi

కోల్‌కతా: రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై దెబ్బ మీద దెబ్బ పడుతోంది. నోట్ల రద్దు తర్వాత మళ్లీ ఇప్పుడు జీఎస్‌టీ వల్ల రియల్టీపై ప్రతికూల ప్రభావం పడుతోంది. జీఎస్‌టీ అమలు వల్ల రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలపై 5–6 శాతం అదనపు పన్ను భారం పడుతోంది. కంపెనీలు దీన్ని భరించడానికి సన్నద్ధమౌతున్నాయి. ‘మేం పలువురు బిల్డర్లతో మాట్లాడాం.

వీరు జీఎస్‌టీ అమలు వల్ల కలిగే అదనపు పన్ను భారాన్ని మోయడానికి తగిన మార్గాలు అన్వేషిస్తున్నారు’ అని నైట్‌ ఫ్రాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్, నేషనల్‌ డైరెక్టర్‌ సమంతక్‌ దాస్‌ తెలిపారు. కాగా రియల్‌ ఎస్టేట్‌పై పన్ను జీఎస్‌టీకి ముందు 6–7 శాతంగా ఉంటే.. జీఎస్‌టీ తర్వాత 12 శాతంగా ఉంది.

మరిన్ని వార్తలు