టెకీ ఉద్యోగ సంఘాలపై ఇన్ఫీ బాలకృష్ణన్

30 May, 2017 14:46 IST|Sakshi

ఉద్యోగుల తొలగింపుతో ఆందోళనలో ఉన్న  టెకీలు  ఉద్యమ బాట పట్టడంపై  ఐటీ పరిశ్రమ సీనియర్‌ స్పందించారు. ఉద్యోగుల సంక్షేమాన్ని బాగా చూసుకుంటున్నపుడు  ఐటీ కంపెనీల్లో  యూనియన్ల అవసరం లేదని టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాజీ బోర్డు సభ్యుడు వి.బాలకృష్ణన్  తేల్చి చెప్పారు. అలాగే ఐటీ లో భారీ ఉద్యోగాల కోత అని వస్తున్న నివేదికలు కేవలం అతిశయోక్తి మాత్రమేనని కొట్టి పారేశారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన చెల్లింపుల విషయంలో తాము చాలా నైతికంగా వ్యవహరిస్తున్నామనీ ఇన్ఫీ మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పిటిఐకి చెప్పారు.  పనిపరిస్థితులు, జీత భత్యాలు అధికంగా ఉన్న ఐటీ పరిశ్రమలో అసలు ఉద్యోగ సంఘాల అవసరం లేదని  వ్యాఖ్యానించారు.  ఉద్యోగులు, వారి హక్కుల పట్ల అస్తవ్యస్తంగా, అనైతికంగా వ్యవహరించే కంపెనీలకు  తప్ప ఐటీ కంపెనీలకు ఉద్యోగ సంఘాలు  అవసరం లేదని చెప్పారు.

ఐటీలో  సంక్షోభంలో ఉన్నపుడు యూనియన్లు పుట్టుకొస్తాయని, కానీ తర్వాత ఉనికిలోఉండవని పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో  కూడా తీసివేతలు రెండంకెల్లోనే  న్నాయన్నారు.  కాబట్టి,   ఐటీ పరిశ్రమలో  యూనియన్ అవసరం లేదనీ , ఒకవేళ  యూనియన్‌  ఉన్నా బాగా శ్రద్ధ తీసుకుంటున్నారని భావించడం లేదన్నారు.  మిగిలిన వాటిల్లా  ఐటి సాంప్రదాయ పరిశ్రమ కాదు. ప్రపంచవ్యాప్తంగా ఇది పని అవకాశాలు కల్పిస్తూ  భిన్నంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రతిభ ఆధారంగా తొలగింపులు తప్ప,  భారీ ఉద్యోగాల నష్టం అనేది  అతిశయోక్తి తప్ప మరోకటి కాదని బాలకృష్ణన్ పేర్కొన్నారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 150 బిలియన్ డాలర్లతో ఐటీ సర్వీసుల పరిశ్రమ ఒకే స్థాయిలో వృద్ధి చెందుతున్నట్లు కనిపిస్తోందనీ వచ్చే ఏడాది రెండింతలు పెరగవచ్చంటూ ఆయన కొత్త ఆశలురేకెత్తించారు. అంతేకాదు ఐటీలో అవకాశాలు చాలా పెద్దవిగా ఉన్నాయన్నారు. భారత్‌కు  అతిపెద్ద మార్కెట్ అయిన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకటిన్నర నుండి రెండు శాతం వద్ద పెరుగుతోందని బాలకృష్ణన్  తెలిపారు.
 

మరిన్ని వార్తలు